విద్యార్థినీ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యo.. ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి వి.శ్రీనివాసు :
పి.గన్నవరం నియోజకవర్గం: 
విద్యార్థినీ విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసినప్పుడే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని స్థానిక శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ తెలిపారు. శనివారం స్థానిక జిల్లాపరిషత్ హైస్కూల్ నందు జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ విద్యార్థులు భట్టి విధానానికి స్వస్తి పలికి, విశ్లేషణాత్మకంగా విద్యా బోధన అభ్యసించినప్పుడే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు నూతన ఆవిష్కరణల ద్వారా నాంది పలికి మన మేధస్సుకు పదును పెట్టినప్పుడే కొత్త కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయన్నారు. శాస్త్రవేత్తలు అందరూ సాధారణ విద్యార్థులు లేనని వారికి ఎదురైన అనుభవాలతో కొత్త కొత్త ఆవిష్కరణలను చేయడం ద్వారా ప్రపంచానికి కొత్త వెలుగులు సృష్టించారన్నారు. శాసన మండలి సభ్యులు ఇళ్ళ వెంకటేశ్వరరావు ,కుడిపూడి సూర్యనారాయణరావులు మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండాలని మానవ మనుగడకు విజ్ఞానశాస్త్రమే మూలమన్నారు. విద్యార్థినీ విద్యార్థులలో దాగిఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయన్నారు. సమాజానికి ఎంతో మేలు చేకూర్చేవిధంగా తక్కువ ఖర్చుతో వినూత్న ఆలోచనలు రేకెత్తించేలా ప్రదర్శనలు ఉండాలన్నారు. ప్రతి విద్యార్థిలో మనోవిజ్ఞానాన్ని నైపుణ్యాలను వెలికితీయడానికి ఇటువంటి ప్రదర్శనలను నిర్వహించాలన్నారు. ప్రధానంగా సౌర విద్యుత్తు పునరుత్పాదక కిందన వనరులు వంటి ప్రాధాన్యత అంశాల పరంగా విద్యార్థులలో అంతర్లీమై ఉన్న మేధా సంపత్తికి పదును పెట్టేందుకు ప్రతిభను వెలికి తీసేందుకు ఈ ప్రదర్శనలు ఉపకరిస్తాల్యన్నారు. విద్యార్థులలోని సృజనాత్మక ఆలోచనలు ప్రతిబింబించే విధంగా ప్రదర్శనలు ఉండాలన్నారు. రాష్ట్ర జాతీయస్థాయిలో జిల్లాకు చెందిన విద్యార్థులు అత్యంత ప్రతిభా పాటవాలను కనబరిచి రాణించేలా ఉపాధ్యాయులు పూర్తి బాధ్యత వహించాలన్నారు. విద్యార్థులు తరగతిగదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలకే పరిమితం కాకుండా వారి ఆలోచనలకు పదును పెడితే వినూత్న ఆలోచనలతో సరికొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందన్నారు. 8,9,10 తరగతిలోకి చెందిన విద్యార్థిని విద్యార్థులు  నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రాజెక్టులు రూపొందించి జాతీయ స్థాయిలో రాణించాలని వారు ఆకాంక్షించారు. డి.ఆర్.ఓ.  కె మాధవి మాట్లాడుతూ విద్యార్థుల చెంతకే ఆధునిక పరిజ్ఞానం మరియు భవిష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు వివరించే లక్ష్యంతో ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్ కు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.విద్యార్థులు సృజనాత్మకతను పెంపొందించుకొని నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలన్నారు.  ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచే పోటీ పరీక్షల్లో పాల్గొనడాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులు విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మెదడుకు పదను పెట్టాలన్నారు. ప్రతికూల ఆలోచనలకు పక్కనపెట్టి సానుకూల దృక్ఫథాన్ని అలవర్చుకోవాలని అప్పుడే అన్నింటా రాణించగలుగుతారన్నారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో భిన్నంగా ఆలోచించడమే కాకుండా, కృషి, పట్టుదలతో చదువుకున్నప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలుగుతారన్నారు. డీ.ఈ.వో. సలీం భాష మాట్లాడుతూ జిల్లా ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయిలో కూడా ఉత్తమ ప్రదర్శనలుగా నిలవాలన్నారు.  విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక ఆలోచనలకు పదను పెట్టే విధంగా ఉపాధ్యాయులు అవసరమైన మార్గదర్శకత్వం చేయాలన్నారు. ప్రతి విద్యార్థిలో అంతర్గతంగా ఉన్న సృజనాత్మకతను గుర్తించి, వారిని ఆయారంగాల్లో వారిని నిష్ణాతులుగా తయారు చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను తమ చిన్నారులపై రుద్దకుండా, వారిలో ఉన్న జిజ్ఞాసకు పదను పెట్టే విధంగా తీర్చిదిద్దాలన్నారు.  22మండలాల నుంచి జిల్లా సైన్స్‌ ఫేర్‌కు 110 ప్రాజెక్టులు ప్రదర్శనకు వచ్చాయన్నారు. వీటి నుంచి విద్యార్థి వ్యక్తిగత విభాగం, గ్రూపు విభాగం, ఉపాధ్యాయ విభాగం నుంచి రెండేసి వంతున మొత్తం ఆరు ప్రాజెక్టులు రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అంతకు ముందుగా జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన లోగో ఆవిష్కరించిన అనంతరం జాతీయ పతాకం, జిల్లా సైన్స్‌ కాంగ్రెస్‌ పతాకం, పాఠశాల పతాకాలను ఆవిష్కరించారు.జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలలో సైన్స్‌ చిత్రమాలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  వివిధ రకాల రంగులు, ముగ్గులతో చిత్రాలను రూపొందించిన చిత్రాలు ఆహూతులను, విద్యా ర్థులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. సేవ్‌ వాటర్, పర్యవరణ పరిరక్షణ, సేవ్‌ గర్ల్స్, మూత్రపిండాలు గుండె రక్త ప్రసరణ టెలిస్కోప్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ ,జిల్లా విద్యాశాఖ అధికారి వార్ల ఫోటోలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు కుడిపూడి సూర్యనారాయణ, ఇళ్ళ వెంకటేశ్వరరావు, ఆర్డీవో పి.శ్రీకర్, జిల్లా సైన్స్ అధికారి జి వి ఎస్ సుబ్రహ్మణ్యం, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు ,ఎస్ ఎస్ ఏ సెక్టోరియల్ అధికారులు డివిఎస్ సుబ్రహ్మ ణ్యం, డి రమేష్ బాబు, ఎం ఏ కే భీమారావు ఎంబిబి సత్యనారాయణ, పి రాంబాబు ,పాఠశాల ప్రధానో పాధ్యాయులు డివిఎస్ ప్రసాద్, ఎం పీ డీ వో కె వి ప్రసాద్, తాసిల్దార్ పి శ్రీ పల్లవి, డీఎస్ఓ ఏ ఉదయ భాస్కర్, ఎంఈఓలు కోన హెలీన, చింతా వీరభ ద్రనందం, స్కూల్ కమిటీ చైర్మన్ నల్ల దుర్గారావు, ఎంపీటీసీ పులపర్తి వెంకటలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు.