పి.గన్నవరం నియోజకవర్గం sbstv న్యూస్ ప్రతినిధి జి.రాజు :
అయినవిల్లి : కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్, రైల్వే ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలపరిధిలోని సానపల్లిలంక గ్రామంలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు పిల్లర్లును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే లైన్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు రైల్వే ట్రాక్ అలైన్మెంట్లును మ్యాప్ లో ఆధారంగా పరిశీలించి అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసిన రైతులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. వీటిపై చర్చించి పరిష్కారానికి తగుచర్యలు చేపడతామన్నారు.ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవిన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్, స్థానిక తాసిల్దార్ సిహెచ్ నాగలక్ష్మమ్మ , రెవిన్యూ ఇన్స్పె క్టర్ ఎం ఎస్ రాయుడు, తదితరులు పాల్గొన్నారు.
కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్, రైల్వే ట్రాక్ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలన్న జిల్లాకలెక్టర్ ఆర్ మహేష్ కుమార్.
January 24, 2025