దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు బృందం జ్యూరిచ్ లో అక్కడి తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయింది. పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని, పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
'జాబ్స్ ఫర్ తెలుగు' కార్యక్రమంలో భాగంగా ఏపీలోనూ, యూరప్ లోనూ ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు.
ఏపిలో పరిశ్రమలకు అనుకూల పరిస్థితులు: లోకేష్
▪️ఏపీలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డీ, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్రెసిషన్ ఇన్స్ట్రుమెంట్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నారా లోకేశ్ కోరారు.
▪️మా ప్రభుత్వం ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇస్తున్నాం.
▪️అనుమతులన్నీ 15 రోజుల్లో ఇచ్చేలా ఎకనమిక్ డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేశాం.
▪️ఏపీలో తీరప్రాంతం, విశాలమైన రోడ్లు, ఎయిర్ కనెక్టివిటీ ఉన్నాయి.
▪️విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం నౌకాశ్రయాలు ఉన్నాయి. త్వరలో భోగాపురం ఎయిర్పోర్టు, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు అందుబాటులోకి వస్తాయి" అని లోకేశ్ తెలిపారు.