డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి వి.శ్రీనివాసు : అమలాపురం : ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పథకం ద్వారా గృహ వినియోగదారుడే విద్యుదుత్పత్తి దారుడిగా మారే అవకాశం కలుగు తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిశాంతి తెలిపారు. అధిక ప్రయోజనాలు కలిగిన సూర్య ఘర్ యోజనను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని తమకు నచ్చిన వెండర్ల ద్వారా సోలార్ రూప్ టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈపీడీసీఎల్ పరిధిలో విస్తృత ప్రచారం,పీఎం సూర్యఘర్ యోజన పై అవగాహన, సోలార్ వినియోగం పెంచడమే లక్ష్యమన్నారు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న విద్యుత్తు తయారీలో 30% బొగ్గు ఆధారితంగా తయారవుతుందని తద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించాలని సంకల్పంతో ప్రధాని సూర్య ఘర్ యోజన పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో కూడా వీటిని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం చెల్లించే విద్యుత్ బిల్లుల చార్జీలను బ్యాంకు రుణం నెలవారీ చార్జీలుగా చెల్లించుకోవచ్చునని మూడు కె.వి ప్యానెల్ ఏర్పాటు ద్వారా మొత్తం ఖర్చు రూ. 2,20,000, రూ.20 వేలు లబ్ధిదారుని వాటాగా చెల్లించాలని మిగిలిన రెండు లక్షలు బ్యాంకు రుణంగా అందిస్తుందని, మీటర్ బిగించిన తరువాత కేంద్రం రూ 78వేలు రాయితీగా అందిస్తుందని మిగిలిన రూ 1,22,000 ఐదు సంవత్సరాల కాలంలో బ్యాంకు రుణం పూర్తిగా తీరుతుందని స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వ విద్యుత్ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయని ఇప్పటికే ఆయా డిస్కంల పరిధిలో సోలార్ ప్రొడక్ట్స్ పై అవగాహన పెంచడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలుచేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారన్నారు.ముఖ్యంగా పీఎం సూర్య ఘర్ పథకం వినియోగదారుల దరిచేర్చేందుకు ప్రత్యేక ప్రచారకార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారన్నారు.ఈ పథకాలతో కలిగే బహుళ ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించి సోలార్ విద్యుత్ వైపు వారితో అడుగులు వేయించాలన్నా రు.సోలార్ వల్ల విద్యుత్ బిల్లులు తగ్గించుకోవడంతోపాటు మిగిలిన విద్యుత్ను గ్రిడ్డుకు విక్రయించి లాభాలు కూడా పొందవచ్చని సూచిస్తున్నారు. ఈ స్కీమ్స్ పొందేందుకు గల నియ మాలతో పాటు బ్యాంకురుణాలు, సబ్సిడీ తదితర పూర్తి సమాచారాన్ని ఎప్పటి కప్పుడు ప్రజలకు చేరవేస్తూ సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్స హించాలన్నారు.
పీఎం సూర్యఘర్ (సోలార్) ద్వారా గృహ వినియోగదారుడే విద్యుదుత్పత్తిదారుడు..జిల్లా జాయింట్ కలెక్టర్ టీ.నిశాంతి
January 08, 2025
పీఎం సూర్య ఘర్ ద్వారా సాధారణ వినియోగదా రులకు, పథకం ద్వారా రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ఈ పథకాలను పొందేందుకు బ్యాంకులు రాయితీలు ప్రకటిస్తుండడంతో విని యోగదారులు సోలార్ వైపు అడుగులు వేయాలన్నారు. పట్టణాలు గ్రామాల్లో సౌర ప్రాజెక్టులు ఏర్పాటుచేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు సౌరశక్తి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు ప్రస్ఫుటంగావివరించాలన్నారు. వినియోగదారులు ఈ ఉత్పత్తులపై వారికున్న సందేహాలను నివృత్తి చేయాలని విద్యుత్ సదుపాయం అంతంత మాత్రమే ఉన్న గ్రామాలను గుర్తించి తొలుత అక్కడ సౌర విద్యుత్ వెలుగులు ప్రసరింపజేసే దిశగా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్కో ఎస్సీ ఎస్ రాజబాబు ,జిల్లాస్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.