కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.7,002 కోట్లు,జనవరి నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా పంపిణీ

 

sbstv న్యూస్ కరస్పాండెంట్ వి.శ్రీనివాసు :
కేంద్ర పన్నుల్లో వాటా కింద ఏపీకి రూ.7,002 కోట్లు,తెలంగాణకు రూ.3,637 కోట్లు.
దేశంలో 28 రాష్ట్రాలు, యూటీలకు నిధులు విడుదల, అత్యధికంగా యూపీకి రూ.31వేల కోట్లు. 
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు వాటాల పంపిణీకింద ఏపీకి రూ. 7,002.52 కోట్లు విడుదల చేసింది. జనవరి నెలకు గాను రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా పంపిణీ నిధులను కేంద్ర ఆర్థికశాఖ విడుదల8 చేసింది. ఇందులో భాగంగా దేశంలోని 28 రాష్ట్రాలు, యూటీలకు గాను రూ.1,73,030 కోట్లను విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. అయితే గత నెల డిసెంబర్ నెల పన్నుల వాటా కింద రాష్ట్రాలకు కేంద్రం కేవలం రూ.89,086కోట్లు రిలీజ్ చేసినట్లు తెలిపింది. కాగా..పన్నుల వాటాలో యూపీకి అత్యధికంగా రూ. 31,039 కోట్లు దక్కాయి. తర్వాతి స్థానంలో బిహార్ కు రూ.17, 403కోట్లు, మధ్యప్రదేశ్ కు రూ. 13,582 కోట్లు, వెస్ట్ బెంగాలు రూ. 13,017 కోట్లను కేంద్రం పంపిణీ చేసింది. అత్యల్పంగా గోవాకు రూ.667 కోట్ల వాటాను రిలీజ్ చేసింది. నిబంధనల ప్రకారం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 14 వాయిదాల్లో కేంద్ర పన్నుల వాటాను రాష్ట్రాలకు పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు.