అమలాపురం రైతుబజార్ పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాoతి


డాక్టర్ బి. ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
అమలాపురం డిసెంబర్ 28: 
నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా కేంద్రం అమలాపురం నడిబొడ్డులో ఉన్న రైతుబజార్ పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి వెల్లడించారు. శనివారం స్థానిక రైతుబజార్ నందు రైతు అవగాహన సదస్సును వివిధమండలాలకు చెందిన రైతులు, ఉద్యాన, మార్కెటింగ్ మత్స్య శాఖల అధికారులతో నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ గత కొంతకాలం క్రితం ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతుబజారులు నెలకొల్పినప్పటికీ వివిధ కారణాలు మూలంగా పూర్తిస్థాయిలో నిర్వహణ జరగడంలేదని గుర్తించి పునరుద్ధరణకు చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. జిల్లాకు సంబంధించి అమలాపురం, రాయవరం, రైతు బజార్ల సమస్యలు ఈనెల18వ తేదీ రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన మార్కెటింగ్ సహకార మత్స్య శాఖల మంత్రి వర్యులు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం దృష్టికి కూడా వచ్చిందని తదనుగుణంగా పునః ప్రారంభానికి చర్యలు చేపట్టినట్లు ఆమె వెల్లడించారు మార్కెటింగ్ విభాగం వారు రైతుబజారు నిర్వహణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఉద్యాన శాఖ అధికారులు గ్రామాలలోని కూరగాయలు పండించే రైతులను గుర్తించి దరఖాస్తులు అందించు కూరగాయలను పండించిన నేరుగా రైతులే ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేకుండా విక్రయాలు జరుపుకునే విధంగా చైతన్య పరచాలని ఆదేశించారు. పూర్తిగా దళారీ వ్యవస్థ లేకుండా రైతు బజార్ నిర్వహణకు పటిష్టమైన చర్యలు గైకొనాలన్నారు.అన్ని వస్తువులు ఒకే చోట తాజాగా లభ్యమయ్యేలా చికెన్, మటన్ చేపల దుకాణాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో సంఘటితంగా కిరాణా దుకాణాలను మూడింటిని నెలకొల్పాలని ఆదేశించారు.రైతు బజార్ నిర్వాహకులు వినియోగ దారుల సౌలభ్యం కొరకు స్థానికంగా ఒక క్యాంటీన్ కూడా నెలకొల్పాలని ఆదేశించారు. స్థానిక పుర పాలక సంఘం వారు రోజువారి రైతుబజార్ వ్యర్థాలను డంపింగ్ యార్డ్ కు తరలిస్తూ పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని ఆదేశించారు. ఆర్టీసీవారు ఉదయాన్నే కూరగాయలు రైతుల సౌలభ్యం కొరకు నిర్దేశిత రూట్లలో బస్సులు నేరుగా రైతు బజార్ వరకు కూరగాయలను, రైతులను కనీస చార్జీలు వసూలు చేస్తూ తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డిఓ మరియు జిల్లా రెవెన్యూ అధికారి ఇన్చార్జ్ కే మాధవి, జిల్లా ఉద్యాన శాఖాధికారి బి వి రమణ, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్ శ్రీనివాసరావు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి కె విశాలాక్షి ,ఉద్యానశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.