ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి వి.శ్రీనివాసు:
డిసెంబర్ 30 : అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో స్థానిక రైసు మిల్లులో డ్రైవర్ గా పనిచేస్తున్న శెట్టిబలిజి సామాజిక వర్గీయుడు వాసంశెట్టి వీరబాబు 9 సంవత్సరాల కుమార్తె వాసంశెట్టి జాహ్నవి అగ్ని ప్రమాదానికి గురై 70 శాతం శరీరం అంతా కాలిపోయింది. కాలిన గాయాలతో తీవ్రంగా బాధపడుతున్న బాధితురాలకి కాకినాడ నగరం క్యాపిటల్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్న విషయం తెలుసుకున్న *రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్తిబాబు* సోమవారం ఉదయం హాస్పిటల్ కు చేరుకొని చిన్నారి జాహ్నవిని పరామర్శించారు. వైద్యులతో సమావేశమై ఆమె ఆరోగ్యం విషయమై వివరాలు అడిగి తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. ఆమె కుటుంబ సభ్యులకు పది వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. తెలుగుదేశం పార్టీ మరియు కూటమి ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రభుత్వాన్ని కోరుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్లు వమ్మి బాలాజీ, పెంకే జగదీష్, సాధికార కమిటీ అధ్యక్షులు పంపన బుజ్జి, చొల్లంగి వీరబాబు, నాయుడు దుర్గ, కుడుపూడి వెంకటలక్ష్మి, లీల, పాలిక సతీష్, వాసంశెట్టి అంజి, తుట్టా లీలావతి, శాంతి, సామర్లకోట హాస్పిటల్ కమిటీ బొందల లక్ష్మీ, మరియు సుమారు 50 మందికి పైగా శెట్టిబలిజనాయకులు వెళ్లి బాధ్యతగా చిన్నారిని పరామర్శించి, ఆమె కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలియజేశారు.
అగ్ని ప్రమాదంలో గాయపడిన చిన్నారి జాహ్నవికి పదివేలు కుడిపూడిసత్తిబాబు ఆర్థిక సహాయం
December 31, 2024