డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
పి.గన్నవరం: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవిన్యూ నదస్సుల ద్వారా భూవివాద సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. సోమవారం స్థానిక మండలపరిధిలోని నరేంద్రపురం గ్రామంలో రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ రెవెన్యూ వివా దాలు పరిష్కరించడంలో బాధ్యతారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితులలోను సహించేదిలేదని అధికారులను హెచ్చరించారు. అధికారులు సిబ్బంది ఆలోచన ధోరణిలను మార్చుకొని అంకితభావాన్ని ఆచరణలో పెట్టడం ద్వారా సదస్సుల లక్ష్యాన్ని నెరవేర్చాలని స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సుల లక్ష్యాన్ని అర్ధం చేసుకుని నిర్లక్ష్యానికి తావు లేకుండా రెవిన్యూ సిబ్బంది అంకితభావంతో పనిచేయాలన్నారు. తహశీల్దార్లు, ఆర్జీవోలు వీలున్నంతవరకు భూ తగాదాలు అక్కడికక్కడే పరిష్కారించాలని, పరిష్కారం కాని వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి నిర్దేశిత ప్రొసీజర్ ప్రకారం పరిష్కారాని కి చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలు పరిష్కారంలో తప్పిపుచ్చుకొనే ధోరణి ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని తెలిపారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తహశీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, విఆర్ఓ, మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రతినిధిలతో పాటు అవసరం మేరకు అటవీ, దేవాదాయశాఖ అధికారులు సదస్సులకు హాజరై అందిన సమస్యలను సాధ్యమైనంత వరకు ఆదేరోజు పరిష్కరింరేందుకు కృషి చేయాలన్నారు. రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు చెక్ పెడుతూ శాశ్వతపరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన ఆర్టీల నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. గ్రామసభలో భూ సమస్యలపై వచ్చిన అర్జీలను స్వీకరించారు. పిజిఆర్ఎస్ కార్యక్రమం లో ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్య లేనని కావున ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందన్నారు.దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూసమస్యలు, వివాదాల పరిష్కారమే అజెండాగా రెవెన్యూ సదస్సులు నిర్వహించాలన్నారు రెవెన్యూ సదస్సులలో పూర్తిస్థాయిలో భాగస్వామ్యులు కావాలన్నారు.
గ్రామాలలోని భూవివాదాల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సదస్సుల్లో ప్రజలు, ప్రభుత్వ అధికారులు పూర్తిస్థాయిలో భాగస్వాము లైతేనే సమస్యలకు నిజమైన పరిష్కారం లభిస్తుందన్నారు. కోర్టు కేసుల వివాదాలు మినహా మిగిలిన భూ వివాదాలకు అక్కడికక్కడే పరిష్కారం చూపాలని తెలిపారు. అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో సరిహద్దు విస్తీర్ణం తగాదాలను సెటిల్ చేసే ప్రయత్నం చేయాలన్నారు. భూ కబ్బాలు, దురాక్రమణలు రుజువైతే అక్కడిక్కడే విముక్తి కల్పించాలన్నారు, ఇంటిపట్టాలపై కూడా విచారణ ఉంటుందన్నారు. గ్రామంవారీగా ఇంటిపట్టాల లబ్దిదారుల జాబితాను బయటపెట్టి అసలైనవారు ఎవరో, అనర్హులు ఎవరో అక్కడికక్కడే ధ్రువీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పి శ్రీకర్ ,తాసిల్దార్ పి శ్రీ పల్లవి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.