ప్రజలవద్దకు వచ్చి భూ సమస్యల పరిష్కారం చేయడమే ప్రభుత్వలక్ష్యం ఎమ్మెల్యే సత్యానందరావు


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
కొత్తపేట మండలం :
ప్రజల వద్దకు వచ్చి భూ సమస్యలు పరిష్కారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట మండలం ఖండ్రిగ గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే సత్యానందరావు,ఆర్డీఓ శ్రీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ..  భూములు కబ్జా గాని లేదా సమస్యలుగానీ ఎదురైతే వాటిని పరిష్కరించడం కోసమే ఈ రెవెన్యూ సదస్సులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.మన ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారని అలాగే భూములను కాపాడుకోవడం కోసం ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు తీసుకురావడం జరిగిందన్నారు. దీంతో మన భూములకు రక్షణ కలుగుతుందని ఈ రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకుని భూ సమస్యలు పరిష్కరించుకోవాలని సత్యానందరావు సూచించారు.
ఈకార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్,రెడ్డీ తాతాజీ,వాసంశెట్టి సత్యనారాయణ, గుబ్బల సత్తిపాండు, గూడెల వెంకటేశ్వరరావు, దునబోయిన అప్పారావు, కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు, చోడే రాజారమేష్ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.