థాయిలాండ్ నుంచి కడియంనర్సరీకి పసుపు సీతాఫలం

తూర్పుగోదావరిజిల్లా, sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు:
తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం బుర్రిలంక సప్తగిరి నర్సరీ రైతు కుప్పాల దుర్గారావు  థాయిలాండ్ నుంచి ఎన్నో కొత్తరకం మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ ఉత్పత్తి చేస్తూ ఉంటారు. అలాగే పసుపు సీతాఫలంమొక్కను తీసుకొచ్చారు. మనం సీతాఫలం ,రామఫలం ,లక్ష్మణ ఫలం ఈ రకమైన పండ్లు చూసాం ..మనం తిన్నాం కూడా. మరి పసుపు సీతాఫలం ఏంటి అది ఏవిధంగా ఉంటుంది దాని లక్షణాలు ఏంటి? దాని రుచి ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
మూడేళ్లక్రితం  పసుపుసీతాఫలంమొక్కను  దుర్గారావు థాయిలాండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. ఇప్పటికి పెరిగి పెద్దయి కాయలు కాస్తుంది. 
విదేశాల నుండి మొక్కలను తీసుకొచ్చి అంట్లు కట్టడంలో  ప్రత్యేక శైలి దుర్గారావుది. అలా అంట్లుకట్టిన మొక్కలను  దేశంలో నలుమూలకి సరఫరా చేస్తారు.
దుర్గారావు ఎన్నో అంట్లు కట్టి  మొక్కలను ఉత్పత్తి చేస్తారు.థాయిలాండ్ నుంచి తీసుకొచ్చిన ఈ మొక్కను ఇక్కడ వాతావరణంకు అనుకూలంగా పెంచి పోషించారు. ఇప్పటికే ఈ మొక్క కాండాలకు అంట్లు కట్టి, పది పదిహేను వరకు అమ్మకాలు సాగించారని వినికిడి. వచ్చే సంక్రాంతి తర్వాత మరిన్ని అంట్లు కట్టడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు.ఈ మొక్క ధర మొదట్లో మూడు, నాలుగు వందలుంటాయి.ఉత్పత్తి పెరిగేకొద్దీ  ఏభై రూపాలకు కూడా లభిస్తాయి.అంటే రాబోయే రోజుల్లో పసుపు సీతాఫలం మన అందరికీ అందుబాటులోకి వస్తుందన్నమాట.కడియం ప్రాంతంలోనే గాక మన దేశంలో అనేక చోట్ల ఇకనుండి పసుపు సీతాఫలం లభించనుంది.

పసుపు సీతాఫలం ప్రత్యేకతలు :
 మనకు దొరికే సీతాఫలం ఏడాదికి ఒక్కసారి మాత్రమే దిగుబడినిస్తుంది. కానీ ఈ పసుపు సీతాఫలం ఏడాదికి రెండుసార్లు దిగుబడికి వస్తాది.
ఒక్క పసుపు రంగ మాత్రమే కాదు సీతాఫలం జాతిలో ఇదొక విచిత్రమైన రకం. 
లోపల గుజ్జు ఎంతో రుచికరంగా ఉంటుంది. అంతేకాదు చాలా గట్టిగాను ఉంటుంది.
చాకుతో కోసుకుని తినే విధంగా. 
పై తొక్క దలసరిగా ఉండటంవల్ల దాన్ని ఒలుసుకొని లోపల భాగాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తినవచ్చు.