డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
పి గన్నవరం నియోజకవర్గం :
పి గన్నవరంలోని మెయిన్ రోడ్ ను ఆనుకుని ఉన్న బాల బాలాజీ థియేటర్ సంక్రాంతికి ముస్తాబవుతుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు పునః ప్రారంభం సందర్బంగా యజమాని సుతాపల్లి మురళి పూజా కార్యక్రమం నిర్వహించారు. వచ్చే సంక్రాంతికి థియేటర్ను ఏసీ, డిజిటల్ టెక్నాలజీతో అభివృద్ధిపరిచి సంక్రాంతి కానుకగా ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కూటమి నాయకులతో కలసి పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఆనందాన్ని,సంతోషాన్ని పంచే విధంగా ఈ థియేటర్ ఉంటుందన్నారు.
ఈ థియేటర్ గన్నవరంలో సుమారు నాలుగు దశాబ్దాలుగా సినీ ప్రేక్షకులను అలరించింది. అటువంటి ఈ థియేటర్ మళ్లీ పునః ప్రారంభించడం ప్రేక్షకులకు ఎంతో సంతోషం కలిగిస్తుందని పలువురు ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం ఇక్కడికి వచ్చిన వారందరూ చక్కటి భోజనం( విందు) ఆరగించారు.
ఈ కార్యక్రమంలో
సాధనాల సత్యనారాయణ (జెడి), ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి ,వాసంశెట్టి కుమార్, వంకాయల గంగరాజు,
వేండ్ర శ్రీనివాసు, సంసాని పెద్దిరాజు,కొండ భాస్కరరావు, తెలగారెడ్డి అగ్ని సుబ్బారావు, నల్లా పెద్దకాపు ,అడ్డగళ్ల సాయిరాం, దొమ్మేటి దుర్గారావు, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.