శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబును సత్కరించిన ఎమ్మెల్యే సత్యానందరావు



డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
కొత్తపేట :
రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ గా ఇటీవల నియమితులైన కుడుపూడి సత్తిబాబును కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సత్కరించారు.వాడపాలెం గ్రామంలో  ఎమ్మెల్యే సత్యానందరావును చైర్మెన్ సత్తిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్ సత్తిబాబును దుశ్శాలువా,పూలమాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నెల 15 వ తేదీన రాజమహేంద్రవరంలో చైర్మెన్ సత్తిబాబు ఆధ్వర్యంలో జరుగనున్న శెట్టిబలిజ,గౌడ, శ్రీశైన,యాత,ఈడిగ మహాదన్ను సభ కరపత్రాన్ని సత్యానందరావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కంఠంశెట్టి శ్రీనివాస్,గుత్తుల పట్టాభి రామయ్య,కేతా శ్రీను,శెట్టిబలిజ  మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.