డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
ముమ్మిడివరం డిసెంబర్ 10: ప్రజల భూముల హక్కుల పరిరక్షణకు, భూ కబ్జాల నుండి సామాన్యులకు రక్షణ, భూ సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా సదస్సులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. స్థానిక మండల పరిధిలోని చిన్న కొత్తలంక గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఆయన ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ టీ నిషాoతి, ఆర్ డి ఓ కే మాధవి గ్రామసభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు కౌంటర్, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం అందించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. రెవిన్యూ సదస్సులు అంకితభావం జవాబు దారి తనoతో పారదర్శకంగా నిర్వహించి భూ సమస్యలకు చెక్ పెట్టాలన్నారు. ప్రజలకు పారదర్శకమైన పాలనను అందించాలని లక్ష్యంతో పలు కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని వీటిలో భాగంగా రెవెన్యూ సదస్సులను పారదర్శకంగా నిర్వహించడం జరుగుతోoదన్నా రు.సదస్సుల్లో వచ్చే విజ్ఞాపనలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేసిందన్నారు. గ్రామంలో డంపింగ్ యార్డ్ సమస్య ఉందని గ్రామస్తులు ముక్త కంఠంతో కోరడం జరిగిందని డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికై ముందుగా గ్రామస్తులు ఈ సదస్సులో అర్జీని నమోదు చేసుకోవాలని సూచించారు తదుపరి ప్రభుత్వ స్థల సేకరణ దిశగా చర్యలు చేపట్టి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రామాలలో రెండు మూడు రోజులు ముందుగా సదస్సులు నిర్వహణ గురించి విస్తృత ప్రచారం గావించడం జరుగుతుందన్నారు. ఈ రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారానికై ఎటువంటి రుసుములు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రైతాంగ సమ స్యలు అధికారుల దృష్టి కి తెచ్చి తగు పరిష్కారం మార్గాలు కోరాలన్నారు. మీకోసం అర్జీల మాదిరిగా టోకెన్ జనరేట్ చేయడం జరుగు తుందని టోకెన్ ఆధారంగా సర్వీసు రిక్వెస్ట్ పరిష్కారం అవుతుందన్నారు ప్రజల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్య లేనని,ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టించన్నారు,దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలు, వివాదాల పరి ష్కారమే అజెండాగా రెవె న్యూ సరస్సుల నిర్వహిస్తున్నామని తెలిపారు..రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకుని భూయజమానులు తమయొక్క భూసమస్య లను పరిష్కరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సదస్సులలో భూమి కొను గోలు, దాన విక్రయo, భాగ పంపి ణీలు ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని రెవెన్యూ రికార్డుల లో పేరు నమోదు చేసుకొను ట కొరకు, పట్టాదారుడు మరణించిన ఎడల వారి వారసుల రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేసుకొనుట కొరకు, వారసత్వపు ఆస్తిని భాగ పరిష్కారo ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని రెవిన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేసుకొనుట కొరకు, రెవిన్యూ రికార్డులలో పట్టాదారు పేరు తప్పులు ఉన్న ఎడల సరి చేసుకొనుటకు, పట్టా భూములు సెక్షన్ 22ఎ నిషేధిత భూముల జాబితాలో ఉన్నచో వాటిని తొలగించుట కొరకు, సర్వే నెంబరు సబ్ డివిజన్లో తప్పులు ఉన్నచో వాటి సవరణ కొరకు, పట్టా భూములు ఇనాం భూమిగా నమోదు అయినచో సవరణ కొరకు, జాయింట్ ఎల్పి ఎం విభజన విస్తీర్ణoలో వ్యత్యా సాలు ఉన్న ఎడల సవరణ కొరకు, గ్రామంలోని ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొల గించుట కొరకు, నీటితీరువా డిమాండు సరిచేసుకొనుటకు చెల్లించుటకు, రెవెన్యూశాఖకు సంబంధించి జి ఎస్ డబ్ల్యూ ఎస్ లోగల పలురకాల పౌర సేవలను ఉచి తంగా వినియోగించుకొనుట, తదితర భూ సమస్యలు పరిష్కరించబడతాయని తెలిపారు.ఈ సదస్సులో పరిష్కర ణకు ఆస్కారమున్న వాటిని అప్పటికప్పుడే పరిష్కరిస్తా రని, క్షేత్రస్థాయి పరిశీలన కూడా వెళ్లి ఫిర్యాదును పరిష్కరించే అవకాశం ఉందన్నారు. జటిలమైన సమస్యలను నిర్దేశత ప్రొసీజర్ ప్రకారం తదుపరి పరిష్కరి స్తారని తెలిపారు.రెవిన్యూ అంశాల మాత్రమే కాకుండా ఇతర అంశాల పైన ప్రజల నుండి అర్జీలు స్వీకరించి సంబంధిత మండల తాసిల్దార్ వారి ద్వారా ఆయా శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం పంపుతారన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, ఆర్డిఓ కే మాధవి, మండల ప్రత్యేక అధికారి డి సి ఓ మురళీకృష్ణ,తాసిల్దార్ సుబ్బలక్ష్మి, ఎంపీడీవో టీ వెంకటాచార్య, వీఆర్వోలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.