కోనసీమలో 65సహకార సంఘాల ద్వారా రైతులకు 800 బరకాల సరఫరా.. జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి


డా||బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా, sbstv  న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు:
అయినవిల్లి మండలం, సిరిపల్లి గ్రామం:
సహకార సంఘాల ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతులకు బారకాలు సరఫరా చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ టి నిషాంతి తెలిపారు. మంగళవారం అయినవిల్లిమండలం సిరిపల్లి రైతు సేవా కేంద్రంలో నలుగురు రైతులకు జాయింట్ కలెక్టర్ బరకాలు సరఫరా చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను వర్షాల మూలంగా కోల్పోకుండా కాపాడుకోవడానికి  జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రైతులకు సహకార సంఘాల ద్వారా జిల్లావ్యాప్తంగా బరకాలు అందిస్తున్నామన్నారు. అవసరమైన రైతులు పీఏసీయస్ ల ద్వారా బరకాలు తీసుకుని ఉపయోగించుకుని అవసరం తీరిన తర్వాత తిరిగి సహకార సంఘాలకు ఇచ్చేలా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 151 పిఎసిఎస్ ల పరిధిలో 221 క్లస్టర్లలో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. అకాల వర్షాలు కారణంగా పండించిన దాన్యం తడవకుండా కాపాడుకోవడానికి 65 పిఎసియస్ లకు 14 లక్షల 40 వేల రూపాయల విలువ గల 800 బరకాలను కొనుగోలు చేసి అందించడం జరిగిందన్నారు. సంబంధిత పిఎసిఎస్ పరిధిలో అవసరమైన రైతులకు ఆర్ఎస్కే కేంద్రాలలో  పరకాల సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ముమ్మిడివరం,అమలాపురం కోపరేటివ్ సబ్ డివిజన్లో 300 బరకాలు, రాజోలు సబ్ డివిజన్లో 100 బరకాలు, కొత్తపేట సబ్ డివిజన్లో 188, ఆలమూరు సబ్ డివిజన్లో 119, రామచంద్రపురం సబ్ డివిజన్లో 93 బరకాలను పిఎసిఎస్ లకు అందించడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ప్రధమంగా డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే రైతులకు బరకాలు అందించడం జరిగిందని జాయింట్ కలెక్టర్  పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి యస్ మురళి కృష్ణ, సచివాలయ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.