డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
అమలాపురం కలెక్టరేట్ : భవన నిర్మాణ రంగానికి ఊతంఇచ్చే దిశగా డిమాండ్ కు అనుగుణంగా ఉచిత ఇసుక సరఫరా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు సూచించారు.గురువారం స్థానిక కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం సభ్యులతో నిర్వహించారు. ఈ సందర్భంగా సెమీ మెకనైజ్డ్ ఇసుకరీచుల టెండర్ కండిషన్స్ అంశం, కొత్తగా గుర్తించిన ఇసుకరీచుల అనుమతులు జారి గురించి, పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలు నిర్వహణపై చర్చ, చింతలూరు లంక రీచ్ నుంచి ఇసుక త్రవ్వకాలు నిర్వహణ , మల్లేశ్వరం ఇసుక రీచు నిర్వహణ, మండల ప్రాంతీయ స్థాయి టాస్క్ ఫోర్స్ బృందాలు బలోపేతం, ఇసుక లభ్యత, సరఫరా అంశాల పురోగతిపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఎనిమిది రీచ్ లలో మనుషుల ద్వా రా ఇసుక త్రవ్వకాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీటిలో పులిదిండి, ఆత్రేయపురం ఊబలంక, వద్దిపర్రు-2, పొడగట్లపల్లి, అంకంపాలెం -2, నార్కెట్ మిల్లి, కపిలేశ్వరపురం ఓపెన్ రీచులలో ఇసుక త్రవ్వకాలు జరుగుతున్నాయన్నారు. టెండర్ల ద్వారా ఇసుక త్రవ్వకాల కొరకు నియమించిన ఏజెన్సీలు వర్క్ ఆర్డర్ ఇచ్చిన మూడు రోజులలో తప్పనిసరిగా తవ్వకాలు ప్రారంభించేలా చర్యలు చేప ట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డ్ లకు ఇసుకను తరలించి అందుబాటులో ఉంచుతూ యధావిధిగా విక్రయాలు కొనసాగించాలన్నారు.ఇసుక వంటి సహజవనరుల వెలికితీత వినియోగంలో గనులు భూగర్భశాఖ పాత్ర కీలకమన్నారు. భవననిర్మాణ రంగానికి ఊతo ఇచ్చే విధంగా ఉచిత ఇసుక పాలసీనీ పారదర్శకంగా నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అనుమతించిన ఇసుక రీచుల నుండి త్రవ్వకాలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తూ సర ఫరా కై చర్యలు గైకొనాల న్నారు. ఉచిత ఇసుకను తీసుకువెళ్లి ఎవరైనా విక్ర యించడం నిల్వ చేస్తు న్నట్లు గుర్తించిన యెడల చట్టపరమైన చర్యలను తీసుకోవాలన్నారు గ్రామ పరిధిలో వ్యక్తిగత అవస రాలకు సమూహ నిర్మాణ పనుల కోసం వినియోగ దారులు ఇసుకను ఎడ్ల బండి లేదా ట్రాక్టర్ ద్వారా మనుషుల ద్వారా తవ్వ కాలు నిర్వహించి తరలిం చుకోవాలన్నారు. జిల్లాలో అక్రమ ఇసుక త్రవ్వకాలు రవాణా నిల్వ, బ్లాక్ మా ర్కెటింగ్ చేస్తున్నట్లయితే కేసులు బనాయించి చర్యలు చేపట్టాలన్నారు. ఎన్ఫోర్స్మెంట్ లు మరింత బలోపేతం చేయాలని అదేవిధంగా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతర పర్యవేక్షణ చేపట్టి అక్రమ ఇసుక రవాణాను పూర్తి స్థాయిలో నిరోధించాల న్నారు. ఉచిత ఇసుక సరఫరాలో ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ప్రవర్తిం చిన ఉపేక్షించేది లేదని ఆయన హెచ్చరించారు. ప్రతి ఏజెన్సీ రోజువారీగా కనీసం 500 మెట్రిక్ టన్నుల ఇసుక త్రవ్వకాలు నిర్వహించాలని అంతకన్నా తక్కువ స్థాయిలో తవ్వకాలు నిర్వహిస్తే ఏజెన్సీని రద్దు చేయడం జరుగుతుందన్నారు.నూతనంగా వశిష్ట గౌతమి నదులలో ఏడు రీచ్ లను గుర్తించడం జరిగిందని, వాటిలో పేరవరం, వెలిచేరు, రాజ వరం, గోపాలపురం 1,2, మెర్లపాలెం, తాడిపూడి రీచులు ఉన్నాయన్నారు. పట్టా భూములలో ఇసుక త్రవ్వకాలకు సంబంధించి సంబంధిత పట్టాదారుని ద్వారా దరఖాస్తులు స్వీక రించి సర్వే, తదితర అ నుమతుల కొరకు చర్యలు చేపట్టాలన్నారు. నూ తనంగా ప్రతిపాదించిన రీచులకు నదీ సంరక్షణ అధికారి అనుమతి డీజీపీఎస్ సర్వే, మైనింగ్ ప్లాను పర్యావరణ అనుమతులు త్వరితగతిన వచ్చే విధంగా ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. నూతనంగా ప్రతిపాదిం చిన రీచులలో బల్క్ వినియోగదారుల కొరకు అన్ని విధాల ఆమోదయో గ్యమైన ఒక సెమీ మెకానై జెడ్ రీచ్ ను ఎంపిక చేయాలని ఆదేశించారు. రవాణా చార్జీలు ఎక్కువ గా వసూలు చేస్తున్నారనే అభియోగాలు ఇకపై ఉత్పన్నం కాకుండా కమిటీ నిర్దేశించిన ధరలు నిర్దిష్టంగా పాటించే విధంగా లారీలు ట్రాక్టర్ల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి నిర్దేశిత ధరలు వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రవాణా అధికారి డి శ్రీనివాసరావును ఆదేశించారు. సమయపాలన రవాణాలో జాప్యాలు నిరోధానికై ప్రతి స్టాక్ యార్డ్ లో కనీసం రెండు జెసిబిలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గోదావరినదిలో వంతెనలు, ఇతర నిర్మాణాలు, కట్టడాలు ఉన్నచోట్ల వాటికి 500 మీటర్ల పరిధిలో ఎటువంటి త్రవ్వకాలు నిర్వహించ రాదని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, జిల్లా గనులు భూగర్భ శాఖ ఏడి ఎల్ వంశీధర్ రెడ్డి, ఆర్డీవోలు పి శ్రీకర్, డి అఖిల, అడ్మిన్ ఎస్పి ప్రసాద్, డిపిఓ శాంత లక్ష్మి, ఆర్ అండ్ బి .ఎస్ ఇ. బి రాము, ఆర్డబ్ల్యూ ఎస్ ఎస్ ఇ. సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి, కోఆర్డినేటర్ సు విజయ్, రియాల్టీ ఇన్స్పె క్టర్ టి సుజాత తదితరులు పాల్గొన్నారు.