స్థానిక కలెక్టరేట్లోని ఇసుక టెండర్ల బిడ్లు ధ్రువీకరణ కమిటీతో సమావేశమై సమీక్షించిన కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
అమలాపురం నవంబర్ 12: కోనసీమ జిల్లాలోని 12 ఇసుక రీచ్ ల నందు  మ్యాన్యువల్ గా ఇసుక తవ్వకాలు వాహనాలలో లోడింగ్, స్టాక్ పాయింట్ల వరకు రవాణా, మరల స్టాక్ పాయింట్ల వద్ద వాహనాలలో ఇసుకను లోడ్ చేయడానికి చార్జీల వసూళ్ల నిమిత్తం పిలిచిన సీల్డ్ టెండర్ల టెక్నికల్ బిడ్ లను పూర్తి పారదర్శకతతో 12 కంపెనీలు సమర్పించిన ధ్రువపత్రాలు, టర్నోవర్  మరియు కంపెనీల ప్రామాణికతను ఐదులీగల్ అంశాల అర్హతలను క్షుణ్ణంగా ధ్రువీకరించి నిర్దేశిత ప్రొఫార్మాలో    సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని  ఇసుక టెండర్ల బిడ్లు ధ్రువీకరణ  కమిటీతో సమావేశమై టెక్నికల్ బిడ్స్ ధ్రువీకరణ పై  సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో12 ఇసుక రీచుల నందు 2025 సంవత్సరం మార్చి 14  వరకు ఇసుక రీచులలో ఇసుకను మాన్యువల్ గా తీసి స్టాక్ పాయింట్ల వద్దకు రవాణా, తిరిగి స్టాక్ పాయింట్ల వద్ద  వాహనాలలో లోడు చేసేందుకై సమర్పించిన సీల్డ్ టెండర్ల టెక్నికల్ బిడ్లను అన్ని పారామీటర్లలో ధ్రువీకరించి సాంకేతికంగా, కంపెనీపరంగా   అర్హత సాధించిన వారి ఫైనాన్షియల్ బిడ్ లను ఇవ్వడం జరుగుతుందన్నారు.  సీల్డ్ టెండర్లు సమర్పించిన కంపెనీలు చివరి మూడు ఆర్థిక సంవత్సరాలలో  సాధించిన టర్నోవర్ నివేదికలను క్షుణ్ణంగా ధ్రువీకరించాలన్నారు. సాంకేతిక బిడ్ లో భాగంగా టెండర్ డాక్యుమెంట్ కు సంబంధించి దరఖాస్తుదారుని టెక్నికల్ క్యాపబులిటీ, రిజిస్టర్ అయిన కంపెనీ/భాగస్వామ్యం లేదా సొసైటీ, నోటరైజేషన్, పవర్ ఆఫ్ పట్టాలు, గతంలో నిర్వహించిన మైనింగ్ ఆపరేషన్ అనుభవాలు, బిడ్డరు నెట్వర్క్ ఈఎస్ఐ రిజిస్ట్రేషన్, ప్రావిడెంట్ ఫండ్  కలిగి ఉండడం, గతంలో గనులు భూగర్భ సివిల్ పనుల నిర్వహణ చేసి ఉన్నది లేనిది ధ్రువీకరించాలన్నారు. గతంలో కంపెనీలు నిర్వహించిన పనులకు సంబంధించి ఎటువంటి రిమార్కులు లేకుండా ఉన్నది లేనిది వాస్తవ నిజాయితీని ఖచ్చిత త్వంతో ధ్రువీకరించాలని ఆయన కమిటీ సభ్యులకు స్పష్టం చేశారు. సాంకేతికంగా అర్హత సాధించి అతి తక్కువగా ధరలు కోట్ చేసినవారికి రీచ్లను నిర్వహించడానికి అనుమతులు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి,జిల్లా గనులు భూగర్భశాఖ అధికారి ఎల్ వంశీధర్ రెడ్డి, జిల్లా రిజిస్టర్ నాగలింగేశ్వరరావు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ ఎస్ మధుసూదన్,జిల్లా ఆడిట్ అధికారి ఎ వి వి సత్యనారాయణ, ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ పి శివరామకృష్ణ, ఆర్ అండ్ బి సూపరింటెండెంట్ ఇంజనీర్ బి రాము, జలవనరులశాఖ డి ఈ బి శ్రీనివాసరావు, అధికారులు, రియాల్టీ ఇన్స్పెక్టర్ టి సుజాత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.