డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వరస్వామివారిని దర్శించుకోవడానికి విచ్చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్
బి ఆర్ నాయుడు దంపతులకు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్వాగతం పలికారు.బిఆర్ నాయుడు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు చేసినారు .అనంతరం స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు బి ఆర్ నాయుడుని దుస్సాలువతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు.
ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, కె వి సత్యనారాయణరెడ్డి, పాలూరి సత్యానందం, ముదునూరి వెంకటరాజు,కరుటూరి నరసింహారావు,కాయల జగన్నాథం,కంఠంశెట్టి శ్రీనివాస్,ముత్యాల బాబ్జీ,యల్లమెల్లి జగన్మోహన్, ఈదాల సత్తిబాబు, ఈదాల నల్లబాబు, కేతా శ్రీనివాస్, పెచ్చేటి చిన్నారావు,ఏపుగంటి వెంకటేశ్వరరావు మరియు తదితరులు పాల్గొన్నారు.