*డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి :*
ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు *మంతెన రవిరాజు* మీడియా సమావేశంలో తెలిపారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా, పి.గన్నవరం మండలం గంటి పెదపూడి గ్రామంలోని ఆయన స్వగృహంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రవిరాజు మాట్లాడుతూ పార్టీలకు ,కులాలకు అతీతంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానన్నారు. ఇప్పటికే రాజకీయ ప్రముఖులు మద్దతు తెలిపారని నిరుద్యోగ యువత కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారన్నారు. కరోనా కష్టకాలంలో కానీ, వరదల సమయాలలో గాని చేసిన సేవా కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. మళ్లీ అన్ని వర్గాల ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. హామీలు ఇవ్వడమే కాకుండా అమలుపరిచే విధంగా మాటలతో కాకుండా చేతలతో చేసి చూపిస్తానన్నారు.
అన్ని వర్గాల ప్రజల మద్దతు కూడగట్టుకొని విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.