పార్వతి సోమేశ్వరస్వామిదేవాలయంలో లక్ష పత్రి పూజ ఘనంగా నిర్వహించారు.


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమజిల్లా పి గన్నవరం నియోజకవర్గ sbs tvన్యూస్ ప్రతినిధి వి.శ్రీనివాసు

పి.గన్నవరంమండలం కారుపల్లి గ్రామంలో వేంచేసినటువంటి పార్వతి సోమేశ్వరస్వామి దేవాలయంలో కొత్తలంక కామేశ్వరరావు ( సూరయ్య) వారి ఆధ్వర్యంలో  బొక్క శ్రీరామ చంద్రమూర్తి రామలక్ష్మి దంపతులచే లక్ష పత్రి పూజ ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పార్వతీ సోమేశ్వర స్వామి దేవాలయంలో కార్తీకమాసం నందు లక్షపత్రి పూజ నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా కారుపల్లి గ్రామ పెద్దలు సంఘ పెద్దలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కగా ఏర్పాట్లు చేశారు. 
ఈరోజు కారుపల్లి గ్రామం అంతా ఆధ్యాత్మికతో శివనామస్మరణతో మారు మ్రోగింది. కోనసీమలోని అనేక గ్రామాలలో కార్తీకమాసమందు  విరివిగా లక్ష పత్రి పూజ నిర్వహిస్తారు. ఆడ మగ తేడా లేకుండా అందరూ కూడా  కార్తీకమాసమందు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలను నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమానికి భక్తులు మండలంలోని నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించి ,తీర్థప్రసాదాలు స్వీకరించారు.