చెస్ పోటీల్లో డీపీఎస్ విద్యార్థిని గుత్తుల వైష్ణవి ప్రతిభ..


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
అమలాపురం కిమ్స్ లో జరిగిన రాష్ట్ర స్థాయి మొదటి కోనసీమ ఓపెన్ చెస్ టోర్నమెంట్-2024 పోటీల్లో అమలాపురం రూరల్ మండలం సమనస ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని గుత్తుల వైష్ణవి విశేష ప్రతిభ కనబరిచింది. అండర్- 15 విభాగంలో  9వ తరగతి చదువుతున్న వైష్ణవి ద్వితీయస్థానం సాధించి రూ 8000/- రూపాయల నగదు బహుమతిని గెలుచుకుంది. అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ చేతుల మీదుగా ఈ నగదు పురస్కారాన్ని విజేత వైష్ణవికి అందజేశారు. చెస్ పోటీల్లో వైష్ణవి విజయం సాధించడం పట్ల పాఠశాల యాజమాన్యం, కోచ్ లు వి.శ్రీను, కె. రాజులు హర్షం వ్యక్తం చేశారు. ఇంతటి చక్కని ప్రతిభను కనబరచిన విద్యార్థినిని  పాఠశాల చైర్మన్ నంద్యాల మనువిహార్, ప్రిన్సిపాల్ దేవిలు అభినందించారు. తమ పాఠశాల చదువులోనే కాకుండా మెదడుకు సానబెట్టే ఆటలలోనూ తర్పీదు ఇస్తుందని తెలియజేసారు.