డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
అభివృద్ధి,సంక్షేమాలకు వారధిగా రాష్ట్ర బడ్జెట్ ఉందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుఅన్నారు.తెలుగుదేశం,జనసేన,కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారిగా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు,అలాగే అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ఈ మేరకు ఈరోజు ఆర్ధిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తిగా ప్రజల ఆమోదయోగ్యంగా ఉందని చెప్పారు.గత జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని,వైసీపీ ప్రభుత్వ చేతగాని పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారన్నారు.గత ప్రభుత్వ వైఫల్యాలతో అస్తవ్యస్తమైన వ్యవస్థలను గాడిలో పెడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించే బాధ్యతా యుతంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని వారికోసం బడ్జెట్ లో విద్యా,వైద్యానికి పెద్దపీట వేశామని తెలిపారు.2.94 లక్షల కోట్ రూపాయల బడ్జెట్ లో బీసీలకు,ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారని తెలిపారు.గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి సారించిన ప్రభుత్వం పంచాయితీ రాజ్ శాఖకు 16 వేల 739 కోట్ల రూపాయలు కేటాయించిందని అలాగే రోడ్ల్ అభివృద్ధికి 9554 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పారు.విద్యా వ్యవస్థలో నూతన మార్పులు తీసుకొచ్చే విధంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేసిన కూటమి ప్రభుత్వం 30 వేల కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు.మహిళా శిశు సంక్షేమం కోసం 4280 కోట్ల,ఎస్సీల సంక్షేమం కోసం 18497 కోట్ల రూపాయలు,ఎస్టీల అభివృద్ధి కోసం 7557 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించినట్లు సత్యానందరావు చెప్పారు.