ఎట్టకేలకు పి.గన్నవరంమండల ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి!


*డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా, పి.గన్నవరం నియోజకవర్గ sbsటీవీ న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు:*

పి.గన్నవరం మండలంలో పి.గన్నవరం గ్రామం అక్విడక్టువద్ద ర్యాంపులో ఇసుక రవాణా చేయడానికి మత్స్యకార సంఘ సభ్యుల సమక్షంలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎట్టకేలకు పీ గన్నవరం మండల ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి. ఎంతోకాలంగా మండల ప్రజలు ఇండ్లు నిర్మించుకొనటానికి ఇసుక లేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

కొత్త ప్రభుత్వం ఏర్పడి చాలా కాలం అయినప్పటికీ ఇప్పటివరకు గన్నవరం మండలానికి ఇసుక ర్యాంపు కేటాయించలేదు.

దాంతో గృహం నిర్మించుకునే వినియోగదారులు ఇసుక మాఫియా దగ్గరనుంచి అధిక ధరలకు కొని కొంతమంది నిర్మించుకోవడం జరిగింది. చాలావరకు ప్రజలు నూతనగృహ నిర్మాణాలు, గృహ మరమ్మతులు వగైరా నిర్మాణాలు  ఇసుక కొరత వల్ల ఆగిపోయాయి.

ప్రభుత్వం ఉచిత ఇసుకనైతే ప్రకటించింది గాని అది గన్నవరం మండలానికి చేరలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, స్థానిక ఎమ్మెల్యే చొరవ వల్ల మత్యకార సంఘం ద్వారా ఇసుక రవాణాకు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ప్రాంత వాసులకు ఇసుక కష్టాలు తీరనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.