కలెక్టరేట్ లోని ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదికలో 198 అర్జీలను స్వీకరించారు

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు :
అమలాపురం నవంబర్ 11: ప్రతి సమస్యపై స్పష్టతతో పరిష్కార మార్గాలు నాణ్యతతో చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నందు నిర్వహించిన ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా జాయింట్ కలెక్టర్ టి నిషాoతి, జిల్లా రెవెన్యూ అధికారి వి.మదనమోహ న్రావు, డిఆర్డిఏ పిడి డాక్టర్ వి శివ శంకర్ ప్రసాద్ అర్జీదారుల సమస్యలను సావధానంగా విని అందుబాటులో ఉన్న అధికారుల ద్వారా తగు పరిష్కార మార్గాలు చూపారు. ఈ ప్రజాఫిర్యాదుల పరిష్కారవేదికలో అర్జీదారుల నుండి సుమారుగా 198 అర్జీలను వారు స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో పారదర్శకత, నిబంధనలు తప్పని సరిగా పాటించాలన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుండి స్వీకరించిన అర్జీలపై పూర్తి స్పష్టతతో పరిష్కరించిన ప్పుడే ఆర్జీదారులు సంతృప్తి చెందడంతోపాటు పదే పదే ఆర్జీలు ఓకే అంశంపై పునరావృతం అయ్యే అవకాశం ఉండదని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారవేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం) ద్వారా, ప్రజల నుంచి స్వీకరించిన ఆర్జీలను నిశితంగా పరిశీలించి సమస్యపై స్పష్టత కలిగినప్పుడే ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించగలుగుతారన్నారు.ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.  పారదర్శకతతో నిబంధనలను పాటిస్తూ అధికారులు ప్రత్యేక దృష్టిసారించి స్పష్టతతో కూడిన పరిష్కార మార్గాలు చూపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారవేదిక కార్యక్రమం ద్వారా ప్రజలసమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఆర్జీదారులు సంతృప్తి చెందేలా పారదర్శకంగా పరిష్కారం ఉండాలని, గడువుతీరిన ఆర్జీలు ఏ స్థా యిలోను  పెండిoగ్ ఉండరా దన్నారు. సంతృప్తికరంగా పరిష్కారం చూపితే ప్రభుత్వ ఉద్దేశం నేరవేరుతుందనే సందేశం ప్రతి అధికారి దృష్టిలో ఉండాలన్నారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకొని అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమ స్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో ఆర్జీదారులు వినతులను సమర్పిస్తారని, ఆయా ఆర్జీలకు సకాలంలో పరిష్కారం చూపాల్సిన భాధ్యత అధికారులపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్  అన్నారు. ఈ కార్యక్ర మంలో డిఇఓ శాంతలక్ష్మి, ఆర్డబ్ల్యుఎఫ్ ఎస్ ఇ సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి, డీఎస్ఓ ఉదయ భాస్కర్, సిపిఓ వెంకటేశ్వర్లు జిల్లా వ్యవసా య అధికారి వి.బోసుబాబు, జిల్లా మేనేజర్ డిఐసి బీకేపీ ప్రసాద్, జిల్లా నీటి యాజమాన్య పి.డి.ఎస్ మధుసూదన్, జిల్లా ఉద్యాన అధికారి బి వి రమణ, జిల్లా పశుసం వర్ధకశాఖ అధికారి డాక్టర్ వెంకటరావు, డిఐపిఆర్ఓ కె లక్ష్మీనారాయణ, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.