డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి శ్రీనివాసు : పి.గన్నవరం నియోజకవర్గం: రాజకీయ పార్టీలకు అతీతంగా ఆపదలో ఉన్న పేద ప్రజలందరికీ ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతను అందిస్తున్నామని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు ఆయన పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గంలోని 15 మందికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.7,47,289 ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు.శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి కింద సహాయం పొందుతున్న ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరమని, వారి అవసరాలను తీర్చడంలో ఇది సహకరిస్తుందని తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంక్షేమం పట్ల కట్టుబడి ఉందని, ఈ సహాయ కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని ఆయన చెప్పారు.ఈ నియోజకవర్గం నుంచి దరఖాస్తు చేసిన ఏ ఒక్క దరఖాస్తు పెండింగ్లో లేదని ,ఇప్పటివరకు సీఎం రిలీఫ్ ఫండ్ కి దరఖాస్తు చేసిన వారందరికీ కూడా రావడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్ నామన రాంబాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా నాథ్ బాబు, నియోజకవర్గ కోకన్వీనర్ దాసరి వీర వెంకట సత్యనారాయణ, ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వాసంశెట్టి కుమార్, కూటమి నాయకులు జే.ఎస్.ఆర్, తోలేటి సత్తిబాబు, అడబాల తాతకాపు, పోలిశెట్టి రాజేష్, సంసాని పెద్దిరాజు, శేరు శ్రీను, నూక పెయ్యి ప్రసన్నకుమార్, తదితరులు పాల్గొన్నారు.