అమలాపురం :రాజ్యాంగ రక్షణకై, ప్రజాస్వామ్య పరిరక్షణకై, సమాజ శ్రేయస్సుకై, అహర్నిశలు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ. ఉగ్రవాద, తీవ్రవాద చర్యలను ఎదుర్కొంటూ, సంఘ విద్రోహ శక్తుల నుండి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ కొరకు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువ లేమని, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎర్ర వంతెన వద్ద నున్న పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్స వం నిర్వహించి అనునిత్యం అసాంఘిక శక్తులతో పోరాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ సిబ్బందికి నివాళులర్పించి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినో త్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం లో ఎన్నోశాఖలు ఉన్నప్ప టికీ పోలీస్ శాఖ విధులు అందుకు భిన్నంగా ఉండి 24 గంటలు విధినిర్వహణలో పోలీసులు సమాజంలో ప్రజలకు రక్షణ కల్పించడం జరుగు తుందన్నారు.మూడు దశలలో పోలీస్ రక్షణ వ్యవస్థలు నిర్వహించడం జరుగుతుందని విధి నిర్వహణలో ఉన్న పోలీసుల సమస్యల పరిష్కారానికి శాఖల సమన్వయంతో చర్యలు చేపడతామన్నారు. అమరుల కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవడం జరుగుతుందన్నారు. ఈ నెల 21న ప్రారంభమయ్యే సంస్మరణ కార్యక్రమాలు 31న జరిగే జాతీయ ఐక్యతా దినోత్సవం రోజున ముగుస్తాయని తెలిపారు. దేశ భద్రత కోసం చేసిన త్యాగాలను సమాజంలోని ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించేందుకు 31 వరకు వరుస కార్యక్రమాలు చేప డతారన్నారు. ఇదే సమయం లో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబాలను సీనియర్ పోలీసు అధికారులు పరామర్శించడంతో పాటు వారికున్న సమస్యల పరిష్కారం, బాగోగుల కోసం కృషి జరుగుతోందన్నారు. 22 నుంచి 30 వరకు అమరులైన పోలీసుల త్యాగాలు, సమాజ హితానికి చేసిన సేవలను వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలకు వివరిస్తారన్నారు.26, 27 తేదీల్లో అన్ని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ఓపెన్ హౌస్ కార్య క్రమాలు ఉంటాయన్నారు. కాలేజీ, పాఠశాల విద్యార్థులు, పోలీసు సిబ్బంది, వారి పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. 28న జిల్లా పోలీసు ప్రధాన కార్యాల యాలు, పోలీసు హెడ్ క్వార్టర్లో పోలీసు సిబ్బం దితో పాటు సాధారణ పౌరుల కోసం మెడికల్ క్యాంపులు ఉంటాయన్నారు. సమాజ హితమే పోలీసుల విధన్నారు. జిల్లా ఎస్పీ బి కృష్ణారావు మాట్లాడుతూ భారత్- చైనా సరిహద్దు ప్రాంతం లో ఎత్తైన మంచు పర్వతాల మధ్యన ఉన్న వేడి నీటి బుగ్గ అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా మన మధ్య నిలిచిoదన్నారు. దేశ వ్యాప్తంగా విధినిర్వహ ణలో అసువులు బాసిన పోలీ సులను స్మరిస్తూ, ప్రతి ఏడాది అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ఆరంభ మైందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన ఆనంతరం పోలీసులు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మొట్ట మొదటి సంఘటనని ఈ సంఘటనను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు ఆదురవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పాటిస్తున్నారన్నారు . ప్రభుత్వం తరపున శాంతి భద్రతలను పరిరక్షించాల్సిన గురుతరమైన బాధ్యత పోలీసు శాఖపై ఉంద న్నారు.ప్రతి ఏడాదీ అన్ని రాష్ట్రాల పోలీసులతో కూడిన బృందం ఈ పవిత్రస్థలాన్ని సందర్శించి నివాళులు అ ర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీసు మేల్కొని, శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం కాపలా కాస్తుంటారని. ఎండ, వాన, పగలు, రాత్రి అనే తేడా లేకుండా కుటుంబంతో కలిసి జరుపుకునే పండగ -పబ్బాల్ని కూడా త్యజించి, ప్రజల కోసం జీవించి, మరణించే పోలీ సులకి, అందునా ప్రాణాలని పణంగా పెట్టి ప్రజల కోసం పోలీసు చేసిన త్యాగానికి సానుభూతి, గౌరవం చూపిం చడం మనందరి బాధ్యతన్నారు పోలీసులుగా బాధ్యత నిర్వర్తించడానికి ముందుకు రాబోతున్న వారికి విధి నిర్వహణలో నూతనోత్తేజాన్ని, స్ఫూర్తిని నింపడమే పోలీసు అమర వీరుల సంస్మరణదినం జరుపు కోవడంలోని ప్రధాన ఉద్దేశ్యమన్నారు. 1959 అక్టోబరు 21న డీఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్ కు చెందిన 21 మంది సభ్యు ల బృందం సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తుండగా, చైనా రక్షణ బలగాలు సియా చెన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంతో సీఆర్పీఎఫ్ దళం దీటుగా ఎదురొడ్డి పోరా డిందని ఈ దాడిలో పదిమంది అమరులయ్యారని తెలిపారు విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేమని, వారిని స్మరించుకోవడం అందరి బాధ్యతని నేరపరిశోధన, ప్రజల సంరక్షణలో పోలీసుల సేవలు ఎంతో గొప్పవని, మన కళ్ల ముందు నిత్యం ఏ కష్టం కలిగినా ముందుగా గుర్తొచ్చేది పోలీసని, వారందరికీ మర్యాద, గౌరవం, విలువ ఇవ్వాల్సిన అవసరముoద న్నారు. నిత్యం పోలీ సులు చేస్తున్న పోరా టాలు, వీరోచిత సాహస చర్యలను మనం చూస్తున్నామని వీరందరూ తమ కుటుంబాన్ని, వ్యక్తిగత జీవితాలను త్యాగంచేసి దేశంలోని కోట్లాది మంది ప్రజల కోసం ఉద్యోగ నిర్వహణలో జీవితాలను అంకితం చేస్తున్నారన్నా రు. అడ్మిన్ ఎస్పీ ప్రసాద్ దేశవ్యాప్తంగా ఏడాదిలో అమరులైన వారి పేర్లు చదువుతూ జోహార్లు అర్పించారు. తొలుత నూతనంగా నిర్మించిన అమర్ జవాన్ స్థూపాన్ని జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆవిష్కరించారు. చివరిగా జిల్లావ్యాప్తంగా వివిధ హోదాలలో పనిచేస్తూ అమరులైన బి.రామ చంద్రరావు, పి.సుబ్బారెడ్డి, వి సత్యసాయి బాబా, టి.బాలాజీ రాజు, కే.ఏడుకొండలకు స్తూపం వద్ద వారి కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్చాలతో నివాళులర్పించి వారు చేసిన సేవలను కొనియాడుతూ జోహార్లు అర్పించారు. అదేవిధంగా అసువులు బాసిన భరతమాత ముద్దు బిడ్డలందరికీ జోహార్లు అర్పించారు. అమరులైన కుటుంబాల వారికి కానుకలు జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పిళ్లి సుభాష్ చంద్రబోస్, రెండవ అదనపు జిల్లా జడ్జి నరేష్, పోలీస్ శాఖకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.