పల్లె పండుగతో రాష్ట్రఅభివృద్ధికి పెద్దపీట ఆత్రేయపురం శంకుస్థాపనలకార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యానందరావు


కొత్తపేట నియోజకవర్గం sbstv న్యూస్ ప్రతినిధి :
ఆత్రేయపురం మండలం :  రాష్ట్ర ప్రభుత్వం 
పల్లె పండుగ పంచాయితీ వారోత్సవాల కార్యక్రమంతో రాష్ట్రఅభివృద్ధికి పెద్దపీ వేసినట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతెలిపారు.ఆత్రేయపురం మండలంలోని మెర్లపాలెం గ్రామం సచివాలయం వద్ద 20 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డు,డ్రైన్ కు శంకుస్థాపన చేశారు.లొల్ల గ్రామం మెయిన్ రోడ్ సిండికేట్ బ్యాంకు వద్ద  14.20 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న  సిమెంట్ రోడ్డుకు,డ్రైన్ నకు శంకుస్థాపన చేయడం జరిగింది.పేరవరం గ్రామం  సచివాలయం వద్ద 26 లక్షల రూపాయలతో  నిర్మిస్తున్న సిమెంట్ రోడ్డు మరియు డ్రైన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.బొబ్బర్లంక గ్రామం S.C.ఏరియా నందు 25 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు మరియు డ్రైన్ శంకుస్థాపన చేశారు. నార్కేడిమిల్లి గ్రామంలో పాత పంచాయతి వద్ద 22 లక్షల రూపాయలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు,డ్రైన్ కు శంకుస్థాపన మరియు అంకంపాలెం గ్రామం రజకపేట మరియు పాటిచెరువు వద్ద 26 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న  సిమెంట్ రోడ్డుకు,డ్రైన్ కు సత్యానందరావు శంకుస్థాపన చేశారు.ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజ (గబ్బర్ సింగ్ ), ముళ్ళపూడి భాస్కరరావు, కాయల జగన్నాధం, సర్పంచ్లు, ఎంపీటీసీలు, కూటమి నాయకులు మరియు అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.