డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమజిల్లా, పి.గన్నవరంనియోజకవర్గం sbstv news ప్రతినిధి :
పి.గన్నవరం మండలంలోని ఊడిమూడి గ్రామం వద్ద వేంచేసి ఉన్న శ్రీ విజయ కనకదుర్గాంబిక అమ్మవారు దసరా సందర్భంగా ఆరవ రోజు అయినటువంటి శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనం ఇచ్చారు. ఊడిమూడి సంత మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారమై బాసిల్లుతున్నారు. విద్యార్థిని విద్యార్థులు ,వ్యాపారస్తులు, ఉద్యోగులు,వ్యవసాయదారులు ఎవరైనా సరే అమ్మవారిని దర్శించి ఏ పనికి వెళ్లిన వెంటనే ఆ పని జరుగుతుందని నానుడి. ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారిని సుమారు లక్ష రూపాయలతో కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. కావున పి.గన్నవరం మండలంలోని భక్తులు, ప్రజలంతా కూడా శ్రీ మహాలక్ష్మి అవతారంలో ఉన్న శ్రీ విజయ కనకదుర్గాంబిక అమ్మవారిని దర్శించి తరిస్తారని ఆలయ కమిటీ వారు కోరుచున్నారు.