డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv న్యూస్ ప్రతినిధి:
మండపేట అక్టోబర్ 7: ప్రజా విజ్ఞాపనల పట్ల సానుకూలంగా స్పందించి అర్జీదారుల సంతృప్తి లక్ష్యంగా సమగ్రమైన పరిష్కార మార్గాలు పూర్తిస్థాయిలో చూపాలని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారుగా 119 అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టర్ తోపాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారి కతీబ్ కౌశర్ భానో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రజాసమ స్యలను సావధానంగా విని సానుకూలంగా స్పందించి వినతులను రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందిన సమస్యలపై పూర్తిస్థాయి విచారణ చేసి పరిష్కరిస్తామనే భరోసా నిచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కారం కోరుతూ ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి రావలసిన అవసరం లేకుండా మండల స్థాయిలో అర్జీదారుల సౌలభ్యం కొరకు మండల కేంద్రాలలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోoదన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలను ఎలాంటి ఆలస్యం లేకుండా త్వరితగతిన పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అర్జీలను నాణ్యతతో పరిష్కరించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి రోజు అర్జీల పరిష్కారానికి సమయం కేటాయించాలన్నారు. అర్జీలను ఎలాంటి పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరిం చాలని సూచించారు. స్వీకరించిన అర్జీలు పరి ష్కారం కొరకు క్షేత్రస్థాయి అధికారికి పంపుచూ వివరా లతో అర్జిదారునికి అధికారిక రశీదు పత్రo ఇస్తారన్నారు. అర్జీదారుడు అర్జీ ఇచ్చిన తరువాత అర్జీని యధాతధంగా స్కాన్ చేసి ఆన్లైన్ ద్వారా పరిష్కారించవలసిన అధికారికి పంపడం జరుగు తుందన్నారు. ప్రతి సమస్య నిర్దిష్ట కాల పరిమితి, గడువు లో పరిష్కరించబడుతుందన్నారు.సిటిజన్ ఆన్ లైన్ లో మీకోసం పోర్టల్ ద్వారా లాగిన్ చేసుకొని తనే స్వయంగా తమ సమస్యను అధికారికి పంపవచ్చునన్నారు. మండలాలలో నెలకొన్న ప్రత్యేక సమస్యలు పరిష్కరించే దిశగా మండల కేంద్రాలలో డివిజన్ అధికారులతో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( మీకోసం) కార్యక్రమం నిర్వహించడం జరుగుతోoదని తెలిపారు. మండల స్థాయిలో గుర్తించిన మేజర్, మైనర్ పనులను చేపట్టేందుకు చర్యలు గైకొంటున్నామని ప్రధానంగా రోడ్లు మరమ్మతులకు రెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పనులు కూడా త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సామాజిక భద్రత పింఛన్లు మంజూరుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ,త్రాగునీటి సమస్యలు పరిష్కారం తోపాటు డంపింగ్ యార్డ్ సమస్యలపై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం డివిజన్ ఆర్డీవో కతీబ్ కౌశర్ భానో డివిజన్ స్థాయి అధికారులు, ఎంపీడీవో నారాయణమూర్తి, తాసిల్దార్ తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.