అమలాపురంలో గ్యాస్ సిలిండర్ లీక్ తో బాణాసంచా పేలుడు విచారకరo రాష్ట్ర కార్మికశాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్


డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమజిల్లా sbs న్యూస్ ప్రతినిధి,అమలాపురం : స్థానిక రావుల చెరువు లో దురదృష్టవ శాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ తో బాణాసంచా పేలుడు సంభవించడం విచారకరమని రాష్ట్ర కార్మికశాఖ మాత్యులు వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. సోమవారం పేలుళ్లు గాయపడిన క్షతగాత్రులను స్థానిక కిమ్స్ ఆసుపత్రిలో మంత్రివర్యులు పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను వైద్యుల ద్వారా ఆరా తీసి, క్షతగాత్రులను  ఆయన స్వయంగా పరిశీలించి ధైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రేలుడు వల్ల సమీపంలో ఉన్న శ్రీరాములు వారి కరుణా కటాక్షంతో పెద్దగా ప్రాణ నష్టం సంభవించలేదని మంత్రివర్యులు పేర్కొన్నారు. మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్య బృందానికి మంత్రివర్యులు సూచించారు. భవనంలో ఉన్న ఏడుగురు గాయాల పాలయ్యారని, ఒక  మహిళ కాలు విరిగి తీవ్రంగా గాయాలు పాలైందని తెలిపారు. బాణాసంచి తయారీకు సంబంధించి లైసెన్సులు లేని వారిపై కఠినమైన చర్యలు గైకొనడం జరుగుతుందని మంత్రివర్యులు స్పష్టం చేశారు. అనంతరం రావులచెరువు 30వ వార్డు నందు  పేలుడు  సంఘటన స్థలాన్నికి చేరుకుని పరిశీలించారు. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండే కోనసీమ ప్రాంతం లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దుర దృష్టకరమని పేర్కొన్నారు. దీపావళి,దసరా, వినాయక చవితి పండగలను పురస్కరించుకుని తక్కువ మోతాదులో బాణాసంచా తయారు చేసిన గ్యాస్ సిలిండర్లు ప్రభావంతో దీని తీవ్రత మరింత పెరిగి భవనం నేలమట్టం అవడం జరిగిందని, 150 మీటర్ల దూరం వరకు భవనాలు అద్దాలు పగలడం కనిపించడం, 100 మీటర్ల దూరంలో భవనాలు ప్రేలుడు దాటికి దెబ్బ తినడం జరిగిందన్నారు.ఏది ఏమైనాప్పటికీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పూర్తిగా లైసెన్సులు కలిగి  ఇళ్ల మధ్యలో కాకుండా గ్రామ శివారు ప్రాంతంలో బాణాసంచా తయారీ దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలని ఇళ్ల మధ్యలో బాణాసంచా తయారీ కేంద్రాలు నెలకొల్పితే చుట్టూ ఉన్న ప్రజలు జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలని మంత్రివర్యులు స్థానిక ప్రజానీకానికి సూచించారు. క్షతగాత్రులకు ప్రభుత్వ పరంగా పూర్తిగా వైద్య సహాయం, కోల్పోయిన గృహాలకు నష్టపరిహారం ఇప్పించడం జరుగుతుందని మంత్రివర్యులు తెలిపారు. అనంతరం స్థానిక స్త్రీ నిధి ఆసుపత్రి నందు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న 23 ఏళ్ల  అమ్మాయి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు.ఈ పర్యటనలో మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.