అమలాపురం,ఆగస్టు 20,2024
సీసీటీవీ కెమెరాల ద్వారా జిల్లాలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోని రికార్డు రూములను పర్యవేక్షించే దిశగా కంట్రోల్ రూమును ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమలాపురం కలెక్టరేట్లో జిల్లాలో ముఖ్యమైన ప్రాంతాలు, కార్యాలయాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసే అంశంపై సంబంధిత అధికారులు, ఎస్ ఎన్ ఆర్ ఈ డేటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు తో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలలోని(తాసిల్దార్ కార్యాలయాలు) రికార్డు రూములు, సంక్షేమ హాస్టల్లు, ఇసుక రీచ్ లు, ఇసుక నిల్వ కేంద్రాలు, ఇతర ముఖ్యమైన ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి అమలాపురం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు అవసరమైన ఇంటర్నెట్ విద్యుత్ సదుపాయాలను కల్పించాలన్నారు. ఆగస్టు 23 లోపు సీసీటీవీలో ఏర్పాటుకు సంబంధించిన పూర్తి నివేదికను అందించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏడి ఇండస్ట్రీస్ శివరామకృష్ణ, ఎస్ ఎన్ ఆర్ ఈ డేటా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి వి విష్ణు రాజు,కలెక్టరేట్ ఎన్ఐసి సిబ్బంది గౌతమ్, కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.