*ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న కొత్తపేట ఆర్డీవో జి.వి.వి.సత్యనారాయణ*
అమలాపురం: sbstv కోనసీమ ప్రతినిధి వి. శ్రీనివాసు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో *రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్,జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్* చేతుల మీదుగా కొత్తపేట ఆర్డీవో జి.వి.వి. సత్యనారాయణ ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. కొత్తపేట డివిజన్ నుండి రెవిన్యూ డివిజనల్ అధికారి వారితో పాటుగా 5 గురు ఉద్యోగులు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టరు శ్రీమతి టి. నిషాంతి, జిల్లా రెవిన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.