sbs tv కోనసీమ ప్రతినిధి: పి.గన్నవరం లోని గోదావరి నదిపై ఉన్న డొక్కా సీతమ్మ, ,సర్ ఆర్థర్ కాటన్ అక్విడక్టులను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్విడక్టులపై నెలకొన్న సమస్యలను ఇరిగేషన్ శాఖ అధికారులు గాలికి వదిలేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ డిఈఈ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పి. గన్నవరం కొత్త, పాత అక్విడక్టులపై నడుస్తూ వెళ్లి ప్రతి గుంతను పరిశీలించారు. పాత అక్విడక్టు పై మొలిచిన రావి మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ మేరకు కొత్త అక్విడక్టుపై ఉన్న గుంతలను పూడ్చాలని, వర్షపు నీరు వెళ్లే రంద్రాల వద్ద పేరుకుపోయిన మట్టిని, రావి మొక్కలను తొలగించాలని సూచించారు. ఈ అక్విడక్టుల అభివృద్ధి కొరకు ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ డిఈఈ వెంకటేశ్వరరావు ను ఎమ్మెల్యే ఆదేశించారు. అదేవిధంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అక్విడక్టులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు తాను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో మాట్లాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో పి. గన్నవరం ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, సర్పంచ్ బొండాడ నాగమణి, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శిరిగినిడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వాసంశెట్టి కుమార్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తోలేటి సత్తిబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సాదనాల శ్రీ వెంకట సత్యనారాయణ, నాయకులు సంసాని పెద్దిరాజు, డివి సత్యనారాయణ, యడ్ల ఏసుబాబు, ఆదిమూలం సూర్యనారాయణ, తాటికాయల శ్రీనివాస రావు, శేరు శ్రీను, పప్పుల సాయిబాబు, పెచ్చెట్టి ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.