సౌదీ నుండి ఇండియాకు తిరిగివచ్చిన వీరేంద్ర కుమార్

స్వదేశానికి తిరిగి వచ్చిన వీరేంద్రకుమార్

అంబేద్కర్ కోనసీమ జిల్లా,అంబాజీపేట మండలం : ఇసుకపూడి గ్రామానికి చెందిన సరెళ్ల వీరేంద్ర కుమార్  సౌదీ అరేబియా దేశం నుండి ఈరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకున్నాడు. సౌదీ అరేబియాలో ఒంటెలు దగ్గర కాపరిగా నియమించడంతో తాను చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఒక వీడియో రిలీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే అది సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలిసింది.దీంతో ప్రభుత్వం స్పందించి ఇండియాకు వచ్చే ఏర్పాట్లు చేయడంతో ఈరోజు స్వదేశానికి తిరిగి వచ్చాడు. వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ నన్ను సౌదీ అరేబియా దేశం నుండి భారతదేశానికి సురక్షితంగా తీసుకువచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, మంత్రి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.