డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం :
sbs tv కోనసీమ ప్రతినిధి:
పాఠశాలలకు రంగులు అద్ది దానినే అభివృద్ధిగా గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు.కొత్తపేట,రావులపాలెం ప్రభుత్వం పాఠశాలలో జరిగిన పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. విద్యార్థిని,విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల ప్రతిభను పెంపొందించడం కోసం కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ కసరత్తులు చేస్తుందని అందుకోసం ఆ శాఖ మంత్రి నారా లోకేష్ వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు.ఇటీవల ఒక్క వాట్సాప్ మెసేజ్ చూసి జీవో నెంబర్ 225 విడుదల చేయడం వల్ల 25 మంది దివ్యాంగులు ఐఐటి,ఎన్ఐటి,ట్రిపుల్ ఐటీ వంటి సంస్థలలో అవకాశం వచ్చిందని విద్యావ్యవస్థలో మార్పులు అంటే ఈ విధంగా ఉంటాయని గుర్తు చేశారు.గత అయిదేళ్ల జగన్ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యిందని వ్యవస్థను గాడిలో పెట్టడానికి తమ ప్రభుత్వం ముమ్మరంగా శ్రమిస్తుందని అన్నారు.విద్యార్థుల పరీక్షలు నిర్వహించెందుకు కేటాయించిన నిధులు సైతం జగన్ ప్రభుత్వం మళ్లించి ఖజానా ఖాళీ చేశారని ఆరోపించారు.తెలుగుదేశం,జనసేన,భాజపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పాటుపడుతుందన్నారు.విద్యార్థుల ప్రతిభను పెంపొందించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు సాయశక్తులా కృషి చేస్తామని సత్యానందరావు తెలిపారు.ఈ కార్యక్రమంలో బూసి జయలక్ష్మి భాస్కరరావు,త్సామా బాబు,మర్గాన గంగాధర్,ఆకుల రామకృష్ణ,కేవీ సత్యనారాయణ రెడ్డి,ధర్నాల రామకృష్ణ,కంఠంశెట్టి శ్రీనివాస్,గుత్తుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు.