బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుల కేశన శంకర్రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా అధ్యక్షుడు సంసాని రామకృష్ణ

డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమజిల్లా sbstv ప్రతినిధి:  

పి.గన్నవరం నియోజకవర్గంలో ఈరోజు పి.గన్నవరం ఆక్విడక్టు వద్ద జిల్లా అధ్యక్షులు సంసాని రామకృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకర్రావు  జన్మదినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా బీసీ సోదరులు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 అనంతరం కేశన శంకర్రావు  జన్మదినోత్సవం సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంసాని రామకృష్ణ  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బీసీ సంక్షేమ సంఘానికి నూతన జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకున్నందుకు
 కేశన శంకర్రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.జిల్లాలోని బీసీ సోదరులందరినీ కలుపుకుని బీసీ సంఘాన్ని బలోపేతం చేస్తానని, బీసీలు అందర్నీ ఏకతాటి మీద తీసుకువచ్చి జిల్లా బీసీ సంఘాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం బీసీ కుల గణనకు సహకరించి బీసీల అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు. 

ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో బీసీ సోదరులైన శెట్టిబలిజలు ,అగ్నికుల క్షత్రియులు,రజకులు, కుమ్మరులు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పేషంట్లకు పాలు, బ్రెడ్ పంచారు.ఈ కార్యక్రమంలో మండల బీసీ నాయకులు వేండ్ర శ్రీనివాసు, సంసాని పెద్దిరాజు, కొల్లు రాంబాబు, దొమ్మేటి సాయి కృష్ణ, కడలి వెంకటరమణ, చొల్లంగి నాగరాజు,  పెచ్చెట్టి రాంబాబు, దాసరి శ్రీనివాస్ ,అంకాని సత్తిబాబు ,పాటి చిట్టిబాబు ,వెల్ల శ్రీనివాసు,   చొల్లంగి నాగరాజు, పొదలాడ శ్రీనివాసు,గుబ్బల తాతారావు తదితరులు పాల్గొన్నారు.