బ్రిడ్జిపై మొక్కలను తొలగించడానికి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్న ఇరిగేషన్ అధికారులు

పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా sbs news ప్రతినిధి:  :  పి.గన్నవరం లోని గోదావరినదిపై ఉన్న డొక్కా సీతమ్మ, ,సర్ ఆర్థర్ కాటన్ అక్విడక్టులను పి. గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అక్విడక్టులపై నెలకొన్న సమస్యలను ఇరిగేషన్ శాఖ అధికారులు గాలికి వదిలేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇరిగేషన్ డిఈఈ వెంకటేశ్వరరావుతో కలిసి ఆయన పి. గన్నవరం కొత్త, పాత అక్విడక్టులపై నడుస్తూ వెళ్లి ప్రతి గుంతను పరిశీలించారు. పాత అక్విడక్టు పై మొలిచిన రావి మొక్కలను ఆయన పరిశీలించారు. ఈ మేరకు కొత్త అక్విడక్టుపై ఉన్న గుంతలను పూడ్చాలని, వర్షపు నీరు వెళ్లే రంద్రాల వద్ద పేరుకుపోయిన మట్టిని, రావి మొక్కలను తొలగించాలని  సూచించారు. ఈ అక్విడక్టుల అభివృద్ధి కొరకు ఉన్నతాధికారులకు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ డిఈఈ వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే ఆదేశించారు. అప్పుడు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ అక్విడక్టులను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు తాను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తో మాట్లాడతానని అన్నారు.
అయినప్పటికీ ఇరిగేషన్ అధికారులు ఇంకా మొద్దు నిద్ర వీడలేదు,వీరు ఇవి తొలగించడానికి మీన వేషాలు లెక్కిస్తున్నారు.స్థానిక ఎమ్మెల్యేగారు బ్రిడ్జిను ఎంతో సుందరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నారు కానీ సంబంధించిన అధికారులు సహకరించట్లేదని ప్రజలు వాపోతున్నారు. ఇంకా ఎంత సమయం తీసుకుంటారో అర్థం కావట్లేదని వాకింగ్ కి వస్తున్నటువంటి ప్రజలు చెబుతున్నారు.ఎమ్మెల్యే మాటలకే లెక్క చేయనిఅధికారులు ప్రజలకు ఏమి చేస్తారో అని అంటున్నారు. ఎప్పటికీ ఈ మొక్కలను తొలగిస్తారో వేచి చూడవలసిందే.ఈ అక్విడక్టులను పర్యాటక కేంద్రాలుగా చూడాలన్న కల కలగానే మిగిలిపోతాదా?