పి గన్నవరం నియోజకవర్గం :
ఎన్టీఆర్ భరోసా క్రింద గత మూడు నెలల నుంచి నెలకి ₹1000 గా 3000, కూటమి ఇచ్చిన హామీ ప్రకారం ఈ నెల 4000 కలిపి మొత్తం 7000 రూపాయలు వృద్ధులకు వితంతువులకు పెన్షన్ ఇవ్వగా, వికలాంగులకు 15వేల రూపాయలు చొప్పున పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిడిఓ ,తహ్షిల్దార్ ,సచివాలయ సిబ్బంది,కూటమికి సంబంధించిన మూడు పార్టీల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన విధంగానే ఒకటవ తేదీ తెల్లవారుజామునే ప్రతి ఇంటికి ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా పెన్షన్ పంచడం జరిగిందని, ప్రతి నెల ఒకటవ తేదీన ఈ విధంగా వృద్ధులకు వితంతువులకు 4000, వికలాంగులకు 6000 అందజేస్తామని ఇచ్చిన హామీని ఇచ్చినట్లుగా నెరవేరుస్తామని తెలియజేశారు.