పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకున్న చంద్రబాబు ఒకే సారి 7 వేలు రూపాయలు పంపిణీ
పెంచిన పింఛన్లు పంపిణీ చేసిన టిడిపి జిల్లా అధ్యక్షురాలు అనంత కుమారి
కొత్తపేట : తెలుగుదేశం పార్టీ మహాకూటమి అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పేదలకు అండగా నిలుస్తుందని అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి పేర్కొన్నారు.
కొత్తపేట మండలంలోని కొత్తపేట మార్కెట్ ఏరియాలో కూటమి నేతలతో కలిసి సోమవారం ఉదయం ప్రతి ఇంటికి వెళ్లి పెంచిన పించన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా ఒకే రోజు ఇంత భారీ మొత్తంలో పింఛన్లు సొమ్ము పంపిణీ చేయడం గొప్ప విషయం అన్నారు.కూటమి ప్రభుత్వం రాకతో ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమం పండుగలు ప్రారంభమయ్యాయని ఆమె గుర్తు చేశారు.ఇకపై రాష్ట్రంలో ప్రతీ పేదవాడు సుఖసంతోషాలతో జీవించే కాలం వచ్చిందన్నారు. త్వరలోనే మహిళలు అంతా బస్సు ప్రయాణం చేసే రోజులు వస్తున్నాయని ఆమె గుర్తు చేశారు.ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సిఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , స్థానిక శాసన సభ్యులు బండారు సత్యానందరావు కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బూసి జయలక్ష్మి, భాస్కరరావు, టీడీపీ నాయకులు మిద్దె ఆదినారాయణ,రొట్టా రమణ, షేక్ అబ్బు, షేక్ అస్లాం, పినేపే వీరబాబు తదితరులు పాల్గొన్నారు.