రాజధాని అమరావతికి 15 వేల కోట్లు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన టిడిపి శెట్టిబలిజ సాధికారత రాష్ట్ర డైరెక్టర్ రెడ్డి సుధీర్

రాజధాని అమరావతికి 15 వేల కోట్లు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేసిన టిడిపి శెట్టిబలిజ సాధికారత రాష్ట్ర డైరెక్టర్ రెడ్డి సుధీర్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం:
 ఆంధ్రప్రదేశ్ కు గత ప్రభుత్వంలో రాజధాని ఎక్కడ అంటే ప్రజలకు ఎవరికి తెలిసేది  కాదు అటువంటి  ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. రాష్ట్ర రాజధాని అమరావతికి 15 వేల కోట్లు కేటాయించడం వల్ల ఆంధ్రుల రాజధాని అమరావతి కల నెరవేరబోతుందనీ హర్షం వ్యక్తం చేసిన టిడిపి శెట్టిబలిజ సాధికారత రాష్ట్ర డైరెక్టర్ రెడ్డి సుధీర్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవడానికి అధిక నిధులు  కేటాయింపు, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేంద్రం
కేటాయించడం ఆనందకరమనీ రెడ్డి సుధీర్ అన్నారు. రాష్ట్ర ప్రగతికి అనుభవజ్ఞులైన పాలకుడు అవసరమని అది నారా చంద్రబాబునాయుడు గారి లాంటి నాయకుడు వల్లే సాధ్యమవుతుందని తెలియజేశారు. అందుకే రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ సారధ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారని రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని టిడిపి శెట్టిబలిజ సాధికారత రాష్ట్ర డైరెక్టర్ రెడ్డి సుధీర్ తెలియజేశారు.అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు దాట్ల బుచ్చిరాజు వారి నాయకత్వంలో ముమ్మిడివరం నియోజకవర్గం అంతా అభివృద్ధి చెందేలా ఇప్పటికే శాసనసభ్యులు తగువిధంగా కృషి చేయడానికి ప్రణాళిక రచించడం అభినందనీయమే అని హర్షం వ్యక్తం చేశారు.