కోనసీమ జిల్లాకు రెండవ నూతన కలెక్టర్ గా రావిలాల మహేష్ కుమార్ గురువారం ఉదయం 11:30 గంటలకు స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.

అమలాపురం sbs tv news జూలై 4: నూతనంగా ఏర్పడిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు రెండవ నూతన కలెక్టర్ గా రావిలాల మహేష్ కుమార్ గురువారం ఉదయం 11:30 గంటలకు స్థానిక కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్  ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ర్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్  నుపూర్ అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి జి కేశవర్ధన్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాలు అధికారి కె లక్ష్మీ నారాయణ కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.