మీ ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా
రేపు రాష్ట్రంలో ఇంటింటికి పింఛన్ల పండుగ
పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్లడి
కొత్తపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం జూలై ఒకటవ తేదీన ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని పింఛన్ల పండుగ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం పిలుపు నిచ్చారు.ఆదివారం ఆయన నివాసం వద్ద నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పించన్ పథకం స్వర్గీయ ఎన్టీరామారావు ప్రవేశ పెట్టి 35 రూపాయలతో మొదలుపెట్టారని ఆయన గుర్తుచేశారు.గత ప్రభుత్వంలో సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున వెయ్యి రూపాయలు పెంచి మూడు వేల రూపాయలకు తీసుకువచ్చారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక్క సారే వెయ్యి రూపాయలు పెంచి 4 వేలకు తీసుకు వచ్చారన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం గత మూడు నెలలకు సంబంధించి నెలకు వెయ్యి చొప్పున 3 వేల రూపాయలు జూలై నెలకు సంభదించి 4 వేలు కలిపి మొత్తం 7 వేల రూపాయలు అందించడం జరుగుతుందని హర్షం వ్యక్తంచేశారు.పెన్షన్ దారులకు అందుతున్న 4వేల రూపాయలలో 2875 రూపాయలు తెలుగుదేశం వాటాయేనని జగన్,రాజశేఖర్ రెడ్డి ఇచ్చింది కేవలం 1125 రూపాయలేనని తెలియజేశారు.