రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక్కోకుటుంబానికి లక్ష రు||లు ప్రకటించిన గిడ్డి సత్యనారాయణ

డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా, పి.గన్నవరం నియోజకవర్గ sbs న్యూస్ ప్రతినిధి  : పి.గన్నవరం మండలంలోని ఊడిమూడి గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గంటి పెదపూడి గ్రామానికి చెందిన నూకపెయ్యి శివ, వాసంశెట్టి సూర్య ప్రకాశరావు, ఈరి కట్టయ్య, ఊడిమూడి గ్రామ శివారు ఆదిమూలం వారి పాలెం కు చెందిన చిలకలపూడి మణి బాబు కుటుంబాలకు పి. గన్నవరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ  ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.4 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించానన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబాల వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రెషియా అందించనున్నట్లు కొత్తపేట ఆర్డీవో సత్యనారాయణ ద్వారా తెలుసుకున్న గిడ్డి సత్యనారాయణ  స్వయంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్ల కి ఫోన్ చేసి బాధితుల కుటుంబ పరిస్థితులను, వారికి కలిగిన నష్టం గురించి వివరించి ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా అందించాలని కోరామని,  బాధిత కుటుంబాల వారికి అండగా ఉంటామని గిడ్డి సత్యనారాయణ హామీ ఇచ్చారు.