పి.గన్నవరం నియోజకవర్గం నాగుల్లంక గ్రామం ఉడ్రాజవరపు పేటలో టీడీపీ నుండి వైస్సార్సీపీ లోకి పలువుర్ని చేర్చుకున్నారు.ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్, తెన్నేటి కిషోర్ ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలవారు వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. గ్రామస్తుల సమక్షములో పురుషులతో పాటు మహిళలకు కూడా వైస్సార్సీపీ కండువాలను వేసి వైస్సార్సీపీ పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించారు ఎమ్మెల్సీ ఇజ్రాయేల్. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ మాట్లాడుతూ చంద్రబాబు మోసపూరిత హామీలతో పార్టీ మేనిఫెస్టో తయారు చేశారన్నారు.
కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ జగనే అన్నారు.కనుక మీరు వైస్సార్సీపీ కి మీ రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీ తో వైస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. అనంతరం గ్రామస్తులు ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ కి,తెన్నేటి కిషోర్ ని సన్మానించారు.