కోనసీమజిల్లా వాసులకు ఉగాది శుభాకాంక్షలు.. కలెక్టర్ హిమాన్షు శుక్లా.

అమలాపురం sbstv న్యూస్ ప్రతినిధి   : తెలుగువారి తొలి పండుగ ఉగాది అని శ్రీ  క్రోధి నామ తెలుగు సంవత్సరo కోనసీమజిల్లా వాసుల అందరి జీవితాల్లో సుఖశాంతులు వెలుగులు నింపాలని జిల్లా కలెక్టర్  హిమాన్షు శుక్లా అభిలసించారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా ఏర్పడిన తర్వాత వరుసగా  రెండవ ఏడాది స్థానిక కలెక్టరేట్లో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను  ప్రభుత్వపరంగా సాంప్రదాయ బద్ద వేద పఠనం పంచాంగ శ్రవణాలతో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మన సనాతన సంస్కృతి ఎంతో గొప్పదని, పంచాంగం మనల్ని వేలు పట్టుకుని నడిపించే దైనందిని ఏడాది కాలానికి దిక్సూచి అన్నారు. రైతాంగం ముఖంలో ఆనందం వెళ్లి విరిసే పండగ ఉగాది పండుగ అన్నారు ఈ ఉగాది ఉప్పొంగే ఉత్సాహాలను చిగురించే సంతోషాలను. విరబూసే వసం తాలను సకల శుభాలను అందించాలన్నారు. నూతనంగా జిల్లా ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిందని బృంద స్ఫూర్తితో బాధ్యతాయుతంగా జిల్లా అభివృద్ధికై విధులు నిర్వహించిన అందరికీ ఈ  సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ నూతన ఏడాదిలో అందరూ ఆయురారోగ్యాలతో జీవించడానికి అనువుగా జీవన శైలి అలవర్చుకోవాలన్నారు. వ్యవసాయ ఆధారిత జిల్లాగా ఉన్న కోనసీమలో గత రెండేళ్లుగా డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ఇంకా కొన్ని సమస్యలు మిగిలి ఉన్నాయని వీటిని ఏడాదిలో పూర్తి చేసి ఖరీఫ్ సీజన్లో రైతులు పండిం చిన పంట ముంపు బారిన పడకుండా అధిక దిగుబడుగులు సాధించే విధంగా కృషి చేస్తామ న్నారు.అన్ని పండుగలు వ్యవసాయంతోనే ముడిపడి ఉంటాయని చైత్ర మాసం తొలి రోజున నూతన సంవత్సర ఆరంభంగా నిర్వహించుకునే సాంప్ర దాయం చాలాచోట్ల కొనసాగుతుందని శ్రీ  క్రోధి నామ ఉగాది సందర్భంగా జిల్లా ప్రజలందరికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జీవితంలో సకల అనుభూతులు మిశ్రమంగా ఇంటింటా జరుపుకునే సాంప్రదాయ వేడుక అన్నారు. ఏడాదంతా సకల జనులు సుఖశాంతులు నూతన కాంతులతో మెరవాలనే ఆకాంక్షల ప్రతిరూపమే ఉగాది అన్నారు,ఏ కాలంలో పండే పంటలు ఆ కాలంలో స్వీకరిస్తూ ప్రకృతికి దగ్గరగా ఆనందంగా జీవించడమనేది ప్రకృతి శాస్త్రంలోని ఆరోగ్యసూత్రమని, అదే ఉగాది పండుగకు పరమార్థమన్నారు. షడ్రుచుల సమ్మేళనంతో ప్రారంభ మయ్యే ఉగాది  కొత్త లక్ష్యాలకు, కొత్త ఆలోచనలకు, ఉజ్వల భవిష్యత్తుకు, జిల్లా సమగ్రాభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక శోభను సంతరించుకునే విధంగా ఉగాది వేడుకలు నిర్వహించుకోవడం సంతోషదాయకమన్నారు. ఉగాది  తెలుగు వారికి ప్రీతిపాత్రమైన పండుగని ఉగాదితోనే మనకు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని సంక్రాంతి నాటికి పంట చేతికి వస్తే. ఉగాదితో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయని ఉగాది నూతన సంవత్సరంలో తెలుగు ప్రజలకు ఆయురారోగ్యాలు ఆనందంతో పాటుగా సిరిసంపదలను ఆ భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నానన్నారు. పురాణాల ప్రకారం, గ్రహాలు, నక్షత్రాలు, బుుతువులు, వర్షపాత వివరాలను లెక్కగడతారని ఉగాది పండుగ నుంచే వసంత బుుతువు ఆగమనం జరుగుతుందన్నారు.అందుకే మన జీవితానికి నాంది పలికే రోజుగా ఉగాది పండుగను జరుపుకుంటా రన్నారు. ఉగాది రోజున ప్రతి ఒక్కరి ఇంట్లో షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేసిన ఉగాది  పచ్చడి మన జీవితం లో జరిగే సుఖశాంతులను సూచిస్తుందన్నారు..ఈ క్రోధి నామ సంవత్సర ఉగాది సమస్త మానవాళికి అందరికీ సంపూర్ణ శుభాలనందించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగ శ్రవణం చేసిన కొమనాపల్లి సూర్యనారాయణ చార్యులు మరియు ఆరుగురు అర్చక స్వాములకు జిల్లా కలెక్టర్ వారు చేతులు మీదుగా పురస్కారాలు అందించి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సిపిఓ వెంకటే శ్వర్లు డి ఆర్ డి ఏ పి డి వి శివశం కర్ ప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఏ బోసు బాబు, పశుసం వర్ధక అధికారి వెంకట్రావు డిటిఓ రామనాథం పంచాయితీరాజ్ ఎస్. ఇ టీ చంటిబాబు, డీఈఓ కమల కుమారి, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ టీ వైద్యనాథ్ శర్మ ఏవో సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్  ఎల్డిఎం కె శ్యాంబాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి నాగల్లేశ్వరరావు, డి ఐ పి ఆర్ ఓ. కే లక్ష్మీనారాయణ,వాఖ్యాత సుబ్రహ్మణ్యం,  వికాస జిల్లా మేనేజర్ జి రమేష్ పాల్గొన్నారు.