కోనసీమజిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా తెలిపారు.

అమలాపురం sbs tv న్యూస్ ప్రతినిధి : కోనసీమ జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నిక ల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా 26 జిల్లాల కలెక్టర్లు ,జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్పిలు జిల్లా జాయింట్ కలెక్టర్లతో  సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పై  ఓటరు దరఖాస్తుల పరిష్కారం, సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థ , సి విజిల్ , సువిధ యాప్  పొలింగ్ కేంద్రాలలో ఏర్పాట్లు  తదితర అంశాల పురోగతిపై  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అభ్యర్ధులలు రాజకీయా పార్టీల ఇంటింటి ప్రచారం కోసం అనుమతులు తప్పని సరని ముందుగా ఆమేరకు సంబంధిత అధికారుల ద్వారా అనుమతులు పొందాలని సూచించారు. తదుపరి సంబంధిత ప్రాంతీయ పోలిస్ స్టేషన్ కు తెలియజేయాలన్నారు . రాష్ట్ర స్థాయి పరిశీలకులు రావడం జరుగుతోందని. ఎన్నికల నిర్వహణలో నియమితులైన అధికార యంత్రాంగం  పూర్తి జవాబుదారీతనంతో బాధ్యత యుతంగా వ్యవహరించి శాంతి యుతంగా, స్వేచ్ఛ యుతంగా  నిష్పక్ష పాతంగా ఎన్నికలను నిర్వహించడం లో నిబద్దత కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియ లో ఎటువంటి సందేహా లున్న నివృత్తి చేసుకొని బాధ్యతా యుతంగా మెలుగుతూ పారద ర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. ఎన్నికలలో ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛాయుతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థ  విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సువిధ యాప్ ద్వారా రాజకీయ పార్టీలు 48 గంటల ముందుగా అనుమతులు పొందాలన్నారు. సి విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదు లను 100 నిమిషాలలో పరిష్కరించడం జరుగుతోoదన్నారు. నిర్ణీత సమయం లోగా మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించాలన్నారు జిల్లాలో 1644 పోలింగ్  కేంద్రాలు ఉన్నాయని, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ అడ్మిన్ ఎస్పి ఖాదర్ భాషా రిటర్నింగ్ అధికారులు ఎస్ సుధా సాగర్, జీవివి సత్యనా రాయణ, ఏ శ్రీరామచంద్రమూర్తి, జి కేశవర్ధన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.