వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పాస్టర్ల ఆశీస్సులతో గద్దెనెక్కి వారిని విస్మరించిందన్న గిడ్డి సత్యనారాయణ

పి. గన్నవరం sbstv news ప్రతినిధి :
సేవే పరమార్ధంగా భావించి రాజకీయాల్లోకి రావడం జరిగిందని పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన, తెలుగుదేశం, బిజెపి ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అన్నారు. ఊడిమూడి లంకలో బుధవారం ఉదయం  జరిగిన నియోజవర్గ స్థాయి పాస్టర్ ల సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసి ప్రసంగించారు. గ్రామాలలోని ప్రజలను మంచి మార్గంలో నడపడానికి పాస్టర్లు చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన అన్నారు. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం పాస్టర్ల ఆశీస్సులతో గద్దెనెక్కి వారిని విస్మరించిందని సత్యనారాయణ అన్నారు. వారికి ప్రభుత్వం నుంచి అందించే గౌరవ వేతనం కూడా గత మూడు నెలలుగా నిలిపివేయo ఆందోళన కలిగిస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి రాకపోతే పథకాలు నిలిపివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని సత్యనారాయణ ఖండించారు. నియోజవర్గంలోని మండల కేంద్రాల్లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ లు నిర్మించాలని, గ్రామాల్లో క్రిస్టియన్స్ కోసం ప్రత్యేకంగా స్మశాన వాటికలకు స్థలం కేటాయించాలని, కోషన్స్ సభ్యులుగా క్రైస్తవులను కూడా పరిగణలోకి తీసుకోవాలని పాస్టర్స్  సత్యనారాయణ గారిని కోరారు. మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సత్యనారాయణ  సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో జార్జ్ పోపప్ , యేసుబాబ్జీ,ముంగి యోహో సువా ,మహమ్మద్ ఆనంద్, పరంజ్యోతి,జార్జిపాల్ తదితరులు పాల్గొన్నారు.