ప్రచారంలో దూకుడు పెంచిన ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ.

పి.గన్నవరం నియోజకవర్గ sbs tv ప్రతినిధి :
డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమజిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం పి.గన్నవరంమండలంలో ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకు ఘన స్వాగతం పలికారు.ఈరోజు  కుందాలపల్లి నుండి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన  గిడ్డి సత్యనారాయణకు అడుగడుగునా నీరాజనాలు పలికారు గ్రామస్తులు.ఎండను సైతం లెక్కచేయక వీధి వీధి తిరుగుతూ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్తూ కుందాలపల్లి,నరేంద్రపురం  గ్రామస్తులందరినీ తనకు ఓటు వేయమని అభ్యర్ధించారు గిడ్డి సత్యనారాయణ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, తెలుగుమహిళలు, వీరమహిళలలతో కలసి ప్రచార  పర్వంలో   దూకుడు పెంచిన గిడ్డి సత్యనారాయణ.నన్ను గెలిపిస్తే రోడ్లు, డ్రైనేజీ, నిరుద్యోగ సమస్యలేకాక అన్నీ విధాల పి.గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి  బాటలో ముందుంచు తానని ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు గిడ్డి.