పి.గన్నవరం విచ్చేసిన సినీ నటుడు పృద్విరాజ్.

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం  :

ఎన్.డి.ఏ.కూటమి స్టార్ కాంపెయిన్ కు పి.గన్నవరం
విచ్చేసిన  పృద్విరాజ్. 
 పి.గన్నవరం నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థి  గిడ్డి సత్యనారాయణ వద్దకు ఈరోజు సినీ నటుడు  పృద్విరాజ్ ( 30yrs ఇండస్ట్రీ ) స్టార్ కాంపెయిన్ కు పి.గన్నవరం క్యాంపు కార్యాలయానికివచ్చారు.క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన సమావేశంలో పృద్విరాజ్ మాట్లాడుతూ ఎన్.డి.ఏ.కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణని అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని, సత్యనారాయణ ఒక పోలీస్  అధికారిగా ఎంతో అనుభవం కల వ్యక్తి అని, అతన్ని గెలిపించుకుంటే మీ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి  చేస్తారన్నారు.తెలుగుదేశం పార్టీకి బీసీలు అంటే కొండంత అండ అని, ఆ బీసీలు అందరూ ఓటు చీలి పోకుండా గిడ్డి సత్యనారాయణకు ఓటు వేసి గెలిపించాలన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని కాపు నాయకుడు అని ముద్రవేశారని కానీ ఆయన అందరీ వాడని అన్నారు. అనంతరం గిడ్డి సత్యనారాయణ పృద్వి రాజ్ ను దుశ్శాలువా తో సత్కరించారు. 
ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు