ఓటర్లు తమ ఓటు హక్కును నిష్పక్ష పాతంగా నిర్భయంగా సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

అమలాపురం ( sbs న్యూస్ ప్రతినిధి )ఏప్రిల్ 3: పార్లమెంట్ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలలో ఎటు వంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటర్లు తమ ఓటు హక్కును నిష్పక్ష పాతంగా నిర్భయంగా సద్వినియో గం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓటర్లకు బుధవారం ఒక ప్రకటన ద్వారా పిలుపు నిచ్చా రు. ఓటు హక్కును వినియోగించుకునే వారు కుల, మత, రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్రమబద్ధమైన ఓటరు  విద్య ఎన్నికలలో భాగస్వామ్యం పేరున ఓటర్లలో చైతన్యాన్ని తీసుకుని వచ్చేందుకు ఓటరు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించడం జరుగుతోoదన్నారు. 85 సంవత్సరాల వయసు పైబడిన వారు, దివ్యాంగులకు కల్పించిన హోం ఓటింగ్ విధానంపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారికి పోలింగ్ కేంద్రాల వద్ద మౌలిక వసతులు కల్పించామని, 18 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా తమ ఓటు నమోదు కానట్లయితే ఫాం-6ను ఆన్లైన్ లేదా బూత్ లెవల్ అధికారిని కలిసి నమోదు చేసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కును వినియోగిం చుకోవాలన్నారు.ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు సదుపాయాల కల్పనకు సాక్ష్యం యాప్ ద్వారా ఎన్నికల్లో పాల్గొనే విభిన్న ప్రతిభావంతులకు ఎన్నికల కమిషన్ పలు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోందని తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకుని జిల్లా లోని దివ్యాంగులంతా శతశాతం వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించడం జరుగుతోoదన్నారు. ఎన్నికల కమిషన్ దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు అన్ని పోలింగ్ కేంద్రాలను గ్రౌండ్ ఫ్లోర్లోనే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. విభిన్న ప్రతి భావంతుల కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా రూపొందించిన సాక్ష్యం యాప్, ఎంతో సహాయకారిగా ఉంటుందని, దీనిని దివ్యాంగులు ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని  కోరారు.. 85 సంవత్సరాలు వయ సు పైబడిన మంచాలకే పరిమితమై నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగు లు హోమ్ ఓటింగ్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓటరు జాబితా లో దివ్యాంగులుగా నమోదై ఉండి. సదరం ధ్రువీ కరణ పత్రం ప్రకారం తమకు 40 శాతం పైబడి వికలాం గత్వం ఉంటే వారు ఇంటివద్దనుంచే ఓటు వేసే అవకాశం ఉందన్నారు. సాక్ష్యం యాప్ ద్వారా హోమ్ ఓటింగ్ కోసం ముందస్తుగా దర ఖాస్తు చేసుకోవా ల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రానికి చేరుకోవడానికి రవాణా సౌకర్యం కావాలన్నా, ఓటరు జాబితాలో పేరు తెలుసుకోవాలన్న తమ పోలింగ్ కేంద్రం వివరాలను తెలుసుకోవాలన్నా వీల్ చైర్, వలంటీర్ సౌకర్యం కావాల్సివచ్చినా ఈ యాప్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వాయిస్ అసిస్టెంట్, తదితర సదుపాయాలు కూడా ఈ యాప్లో ఉన్నాయని వివరించారు. జిల్లా వ్యాప్తంగా వీల్ చైర్లను ఎన్నికల రోజు అందుబాటు లో ఉంచుతామని చెప్పారు. అంధు లకు బ్రెయిలీ లిపిలో ఓటరు స్లిప్పులను పంపిణీ చేసేoదుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బ్రెయిలీ లిపిలో నమూనా బ్యాలెట్ పేపరు ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటు వేయవ చ్చునని తెలిపారు. ఈవీఎంలపైనా ట్రెయిలీ లిపిలో నంబర్లు ఉంటా యన్నారు. లేదా వలంటీరు ఉప యోగించుకొని తమ ఓటు హక్కు ను వినియోగించుకోవ చ్చన్నారు. విభిన్న ప్రతిభా వంతుల కు అనుకూలంగానే ఓటింగ్ ప్రక్రియ ను రూపొందించినట్లు వివరించారు.