*జనసంద్రమైన పి.గన్నవరం*
కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణకి మద్దతుగా వేలాదిగా తరలివచ్చిన అభిమానులు.
పి.గన్నవరం ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన పి.గన్నవరం నియోజకవర్గ ఎన్.డి.ఏ.కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ.
ఈ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూలల నుండి ప్రజలు, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గిడ్డి సత్యనారాయణ అభిమానులు భారీగా తరలిరావడంతో జి. పెదపూడి నుండి గన్నవరం వరకు రోడ్డు జనసంద్రంగా మారినది.
ఒక ప్రక్క బీజేపీ కార్యకర్తల కోలాహలం, మరోప్రక్క టీడీపీ శ్రేణుల హర్షధ్వనులతో వేరొక ప్రక్క జనసైనికుల కేరింతలు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తల హర్షద్వానాల మధ్య నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా గిడ్డి సత్యనారాయణ మేళ తాళాలతో భారీ ర్యాలీగా RO ఆఫీస్ కి వచ్చి నామినేషన్ వేశారు.అనంతరం గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ నన్ను ఉమ్మడి కూటమి బలపర్చిన అభ్యర్థిగా నేను టీడీపీ,బీజేపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా వచ్చి నామినేషన్ వేస్తున్నా,నన్ను నియోజకవర్గ ప్రజలంతా ఆశీర్వదించాలని కోరుచున్నాను.నా వెంట భారీ ర్యాలీగా వచ్చిన టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, తెలుగు మహిళకు, వీరమహిళలకు నాదన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.